చిత్రం: అంతం (1992)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: మనో, కవితాకృష్ణమూర్తి
సంగీతం: ఆర్. డి. బర్మన్
పల్లవి: హే...ఊహలేవో రేగే.. ఊహలేవోరేగే ఊపుతోననులాగే వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే ఆదుకోవా అయిన దాన్నేగా పూలతీగై ఊగే లేతసైగేలాగే హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే అందుకోవా ఆశేతీరగా ఊహలేవోరేగే ఊపుతోననులాగే హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే చరణం : 1 ఇదివరకెరగని దిగులును దిగనీవా నిలువున రగిలిన నిగనిగ నీడేగా మెలికలు తిరిగిన మెరుపై దిగినావా కుదురుగా నిలవని కులుకుల తూనిగా ఓ..కోరివస్తా కాదు అనుకోకా...ఆ... ఊహలేవోరేగే ఊపుతోననులాగే హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే ఆదుకోవా అయిన దాన్నేగా చరణం : 2 ఎందుకు ఏమిటి అడగని గొడవేగా ఓడేదాకా వదలని ఆటేగా ఓ..గుసగుసవేడికి గుబులే కరుగునుగా కుశలములడుగుతూ చెరిసగమైపోగా ఒకరికొకరం పంచుకుందాం రా.. ఆ..ఆ.. పూలతీగై ఊగే లేతసైగేలాగే హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే అందుకోవా ఆశేతీరగా హే... ఊహలేవోరేగే ఊపుతోననులాగే వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే ఆదుకోవా అయిన దాన్నేగా.. ఆ.. లలలాల.. లాలలాలా.. లలలాలా లాలలాలలాలా లాలలాలలలాలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి