చిత్రం: చూపులు కలసిన శుభవేళ (1988)
రచన:
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం: రాజన్-నాగేంద్ర
పల్లవి :
సిరిమల్లీ శుభలేఖా... చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
అక్షర లక్షా ముద్దుల బిక్ష
కందిన మొగ్గా కమ్మని బుగ్గా
చిరునవ్వే శుభలేఖ... చదివావా శశిరేఖ
చరణం 1 :'
జాజిమల్లి తీగనై జూకామల్లి పువ్వునై ... నీ చెంత చేరేనులే
ఋతు పవనాలలో రస కవనాలతో... తీర్చాలి నా మోజులే
రాజీ లేని అల్లరి రోజాపూల పల్లవి... నీ పాట కావాలిలే
కథ రమణీయమై చిరస్మరణీయమై...
సాగాలి సంగీతమై... అనురాగ శ్రీగంధమై
చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ
అక్షర లక్షా ముద్దుల బిక్ష
కందిన మొగ్గా కమ్మని బుగ్గా
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
చరణం 2 :
రాగాలన్ని నవ్వులై రావాలంట మువ్వవై ... నా ప్రేమ మందారమై
తగు అధికారము తమ సహకారమూ ... కావాలి చేయూతగా
బుగ్గ బుగ్గ ఏకమై ముద్దే మనకు లోకమై... నూరేళ్ళు సాగాలిలే
ఇది మధుమాసమై మనకనుకూలమై..
జరగాలి సుముహుర్తమే... కళ్యాణ వైభోగమే
సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
లాలాలా ఆహాహాహా..లాలాలా ఆహాహాహ
సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి