చిత్రం: ఎర్ర గులాబీలు (1979)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం: ఇళయ రాజా
పల్లవి :
రురూరురూ.. రురురురూ..రురురురురురు..
ఎర్రగులాబి విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది..
చరణం 1 :
లతనై నీ జతనై నిన్నే పెనవేయనా
కతనై నీ కలనై నిన్నే మురిపించనా
నేనిక నీకే సొంతము
న న న న న నీకెందుకు ఈ అనుబంధము
న న న న న న న న న న న న న నా
ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది ..
చరణం 2 :
పెదవిని... ఈ మధువునూ నేడే చవిచూడనీ
నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా
వయసుని వయసే దోచేది
న న న న న న అది మనసుంటేనే జరిగేది
న న న న న న న న న న న న న నా
ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది..నననన.. నననన..అహహా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి