27, జనవరి 2025, సోమవారం

I Love You (1979) : Oka Maatundhi Song Lyrics (ఒక మాటుంది..)

చిత్రం: ఐ లవ్ యూ (1979)

సాహిత్యం:

గానం: ఎస్.జానకి

సంగీతం: సత్యం



పల్లవి :

ఒక మాటుంది.. కలవరం రేపి
మనసులో దాగను అంటోంది.. ఐ లవ్ యూ
పొంగే వయసిది.. పూచే మరి మరి.. రా దొరా

ఒక మాటుంది.. కలవరం రేపి
మనసులో దాగను అంటోంది.. ఐ లవ్ యూ

చరణం 1 :

చిటికేసి రమ్మంటే చిలకల్లే రానా
తలుపేసి ఇమ్మంటే మైమరచిపోనా
సరసాలలోనా నే చాలనా
నీ ఆరని కోరిక తీర్చలేనా

ఒక మాటుంది.. కలవరం రేపి
మనసులో దాగను అంటోంది.. ఐ లవ్ యూ
లా..లల్లాలాల్లా... లల లలలా
లలలా లాలలల్లా.. లలల లలాల్ల ల ల లా

చరణం 2 :

ఒకనాడు చూపావు తొలివలపు మోహం
ఈనాడు చూస్తావు ఒక వింత దాహం 
అరుదైన స్నేహం అందించనీ
ఈ అనుభవం గుండెలో దాచుకోనీ

ఒక మాటుంది.. కలవరం రేపి
మనసులో దాగను అంటోంది.. ఐ లవ్ యూ
పొంగే వయసిది.. పిలిచే మరి మరి.. రా దొరా

ఒక మాటుంది.. కలవరం రేపి
మనసులో దాగను అంటోంది.. ఐ లవ్ యూ

ఐ లవ్ యూ... ఐ లవ్ యూ... ఐ లవ్ యూ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి