27, జనవరి 2025, సోమవారం

Kanne Manasulu : Oho.. Tamrenaa Choodavaccharu Song Lyrics (ఓహో తమరేనా చూడ వచ్చారు..)

చిత్రం: కన్నెమనసులు (1966)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి :

ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు
ఓ భామా...  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

చరణం 1 :

ఆకతాయి రాలుగాయి అమ్మాయి
అంతకన్న గడుగ్గాయి అబ్బాయి
ఆకతాయి రాలుగాయి అమ్మాయి
అంతకన్న గడుగ్గాయి అబ్బాయి
మండేన ఒళ్ళు...  కొరికేవ పళ్ళు
ఎరుపెక్కె కళ్ళు...  అరికాళ్ళ ముళ్ళు
కోపాల తాపాల...  శాపాన రూపాన.. తొక్కేవు పరవళ్ళు..
ఓ భామా...  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు


చరణం 2 :

మూతిని ముడవకే ముద్దులగుమ్మా
ఆ..  ఆ...  ఆ..  ముచ్చటలాడితినే వలపుల రెమ్మా
ముసిముసి నవ్వులతో మోడీ చేతునే
ముసిముసి నవ్వులతో మోడీ చేతునే
కసిదీరా గుణపాఠం నేర్పిస్తానే

ఓ భామా...  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

చరణం 3 :

కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు
చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు
కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు
చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు
అమ్మాయిగారు ముయ్యాలి నోరు
మాతోను మీరు సరిసాటి కారు
కన్నీరు మున్నీరు కాదండి పన్నీరు... తగ్గాలి మీ జోరు
ఓ భామా...  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి