27, జనవరి 2025, సోమవారం

Kanne Manasulu : Valapulo.. Song Lyrics (వలపులో వద్దు వద్దు )

చిత్రం: కన్నెమనసులు (1966)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: పి.సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి :

వలపులో....
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే...
కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే...
కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో.... 

చరణం 1 :

అందలం నే దిగి వచ్చాను... అందని మనసే ఇచ్చాను
అందలం నే దిగి వచ్చాను... అందని మనసే ఇచ్చాను
నీలో ఏదో ఉన్నదిలే.. అది నీతో నన్నే కలిపెనులే..
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... 
కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో.... 

చరణం 2 :

కనపడగానే కరిగిస్తావని కలలే ఎన్నో కన్నాను
కనపడగానే కరిగిస్తావని కలలే ఎన్నో కన్నాను
ఉలకవు పలకవు ఎందుకని?... ఈ అలకకు కారణం ఏమిటని?

వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... 
కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో....

చరణం 3 :

మగవారంటే పగవారనుట... తగదని నేడే తెలిసింది
మగవారంటే పగవారనుట... తగదని నేడే తెలిసింది
నదులు కడలిలో చేరాలి... కలువ జాబిలి కలవాలి
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... 
కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో....


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి