చిత్రం: ఖైదీ(1983)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి:
ఇదేమిటబ్బా..ఇది అదేను అబ్బా
అదేమిటబ్బా.. అది ఇదేను అబ్బా
సొగసుకు వయసే సోకబ్బా
వయసుకు మనసే వడదెబ్బా
చూపులోని తీపి దెబ్బా చెప్పలేని ఘాటు దెబ్బా అబ్బా
హా హా హా హా .. ఇదేమిటబ్బా..ఇది అదేను అబ్బా
అదేమిటబ్బా.. అది ఇదేను అబ్బా
తడి తడి ఊహల పొడి దెబ్బా
తొలకరి వలపుకు గురుతబ్బా
రాలుగాయి ప్రేమదెబ్బ రాసుకుంటె ఆడ దెబ్బా అబ్బా..
హా హా హా హా .. ఇదేమిటబ్బా..ఇది అదేను అబ్బా
చరణం 1:
సాగే గాలికి రేగే పైట నవ్వింది
ఆ నవ్వుల పువ్వులు నీవంది
నీలో వయసే వెన్నెల ఏరై పారింది
ఆ ఏటికి రేవే నీవంది
చెక్కిళ్ళ నీడలోనా..పందిళ్ళు వేయమంది
పరువాల జల్లు లోనా..నీ తోడు కోరుకుంది
నీ కొన చూపులో.. నీ చిరునవ్వులో..
నా తొలి ప్రేమ ఊరేగుతుంది.. నా తొలి ప్రేమ ఊరేగుతుందీ...
ఇదేమిటబ్బా..ఇది అదేను అబ్బా
అదేమిటబ్బా.. అది ఇదేను అబ్బా
చరణం 2:
కళ్ళు కళ్ళు కలబడుతుంటే చూడాలి
అది ఆగని అల్లరి కావాలి
వయసు మనసు తడబడుతుంటే చూడాలి
అది వలపుల బాటలు వెయ్యాలి
సరికొత్త ఊహలెన్నో..సడిచేర్చి రేగుతుంటే
ఆ మత్తులోన నేనే..మైమరిచి తేలుతుంటే
ఆ మురిపాలకూ.. ఆ ముచ్చట్లకూ..
ఇహ లోకాన అంతెక్కడుంది.. ఇహ లోకాన అంతెక్కడుందీ...
అరే ఇదేమిటబ్బా..ఇది అదేను అబ్బా
మరి అదేమిటబ్బా.. అది ఇదేను అబ్బా
సొగసుకు వయసే సోకబ్బా
వయసుకు మనసే వడదెబ్బా
చూపులోని తీపి దెబ్బా చెప్పలేని ఘాటు దెబ్బా అబ్బా..
అరెరెరెరే ఇదేమీటబ్బా..ఇది అదేను అబ్బా
అదేమిటబ్బా..అది ఇదేను అబ్బా
తడి తడి ఊహల పొడి దెబ్బా
తొలకరి వలపుకు గురుతబ్బా
రాలుగాయి ప్రేమదెబ్బ రాసుకుంటె ఆడ దెబ్బా అబ్బబ్బబ్బబ్బా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి