చిత్రం : నారి నారి నడుమ మురారి (1990)
సంగీతం: కె. వి. మహదేవన్
గీత రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
నేపథ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
పల్లవి :
ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి అవీ ఇవీ చూసేస్తోందే
ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గోలో ఉరుముతున్నదీ
ఆట పాట చూపీ అటూ ఇటూ లాగేస్తోందే
ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
ఆ...
చరణం 1 :
చినుకు పడు క్షణమేదో చిలిపి సడి చేసిందీ
ఉలికిపడి తలపేదో కలల గడి తీసిందీ
వానమ్మా వాటేస్తుంటే మేనంతా మీటేస్తుంటే
ఇన్నాళ్ళూ ఆ..ఆ..
ఓరగ దాగెను వయ్యారం ఓగున పాడెను శృంగారం
ఏ గాలి కొట్టిందొ నీ దారి పట్టింది
ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
ఆ...
చరణం 2 :
మనకు గల వరసేదో తెలిసి ఎద వలచిందో
మునుపు గల ముడి ఏదో బిగిసి జత కలిపిందో
ఏమైందో ఏమోనమ్మా
ఏనాడో రాసుందమ్మా
ఇన్నాళ్ళూ ఆ.. ఆ..
ఉడుకున ఉడికిన బిడియాలు ఒడుపుగ ఒలికెను చెలికాడు
నా చూపు నచ్చిందొ నాజూకు ఇచ్చింది
ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి అవీ ఇవీ చూసేస్తోందే
ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
హ్మ్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి