8, జనవరి 2025, బుధవారం

Sisindri : Chinni Tandri Ninu Choodaga Song Lyrics (చిన్ని తండ్రి నిను చూడగా)

చిత్రం: సిసింద్రీ(1995)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: రాజ్

గానం: స్వర్ణలత



పల్లవి :

చిన్ని తండ్రి నిను చూడగా

వెయ్యి కళ్ళైనా సరిపోవురా

అన్ని కళ్ళు చూస్తుండగా

నీకు దిష్టేన్తా తగిలేనురా

అందుకే అమ్మ వడిలోనే దాగుండిపోరా

చిన్ని తండ్రి నిను చూడగా

వెయ్యి కళ్ళైనా సరిపోవురా


చరణం:1

ఏ చోట నిమిషం కూడా వుండలేడు

చిన్నారి సిసింద్రీల చిందు చూడు

పిలిచినా పలకడు వెతికినా దొరకడు

మా మధ్య వెలిసాడు ఆ జాబిలీ

ముంగిట్లో నిలిపాడు దీపావళి

నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు


చిన్ని తండ్రి నిను చూడగా

వెయ్యి కళ్ళైనా సరిపోవురా

అన్ని కళ్ళు చూస్తుండగా

నీకు దిష్టేన్తా తగిలేనురా


చరణం:2

ఆ మువ్వా గోపాలుళ్ళ తిరుగుతుంటే

ఆ నవ్వే పిల్లంగ్రోవై మోగుతుంటే

మనసులో నందనం

విరియాదా ప్రతి క్షణం

మా కంటి వెలుగులే హరివిల్లుగా

మా ఇంటి గడపలే రేపల్లెగా

మా ఈ చిన్ని రాజ్యానికి యువరాజు వీడు


చందమామ చూసావటోయ్

అచ్చు నీలాంటి మా బాబుని

నెల అద్దాన నీబింబమై పారాడుతుంటే

చందమామ చూసావటోయ్

అచ్చు నీలాంటి మా బాబుని




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి