2, ఫిబ్రవరి 2025, ఆదివారం

Amaayakuraalu : Sannajaji Puvvulu Song Lyrics (సన్నజాజి పువ్వులు )

చిత్రం: అమాయకురాలు (1971)

సాహిత్యం: దాశరధి

గానం: ఘంటసాల, పి.సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు




పల్లవి :

సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు..
చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు..
బంగారు జోతుల దీవెనలు
సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు...
చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు...
బంగారు జోతుల దీవెనలు

చరణం 1 :

పాపాయి గెంతులు... తువ్వాయి చెంగులు
పాపాయి గెంతులు... తువ్వాయి చెంగులు
తూరీగలాగ దొరకదు.. 
పరుగులు తీస్తే పండుగ.. ఉరకలు వేస్తె వేడుక
మా జోతి చిందులే అందాల విందులు
సన్నజాజి పువ్వులు.. చందమామ కాంతులు...
చిన్నారి పాపా నవ్వులు 

చరణం 2 :

తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను..
అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను
తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను...
అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను
ఆడిన ఆట.... పాడిన పాట...
ఆడిన ఆట అల్లరి... పాడిన పాట పల్లవి..
మా జోతి మాటలే వరహాల మూటలు
సన్నజాజి పువ్వులు.. చందమామ కాంతులు..
చిన్నారి పాపా నవ్వులు

చరణం 3 :

ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు
ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు 
ఆనందమొసగే వరములు
ఇరుగుపొరుగు మెచ్చగా ఇంటిల్లిపాదికి నచ్చగా.. 
చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా

సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు..
చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు..
బంగారు జోతుల దీవెనలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి