4, ఫిబ్రవరి 2025, మంగళవారం

Angadi Bomma : Jabilli Vennellu Song Lyrics (జాబిల్లి వెన్నెళ్ళు చవిచూడలేదు)

చిత్రం: అంగడి బొమ్మ (1978)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఎస్.జానకి

సంగీతం: సత్యం




పల్లవి :

జాబిల్లి వెన్నెళ్ళు చవిచూడలేదు
సిరిమల్లె పువ్వుళ్ళు సిగముడువ లేదు
కనులారా ఒకరాత్రి కునుకైనలేదు
మనసారా మాటాడ మనిషైన లేడు 
బ్రతుకంతా మరుభూమి కాగా
ఆమె మిగిలింది ఒక గాధగా
ఆమె మిగిలింది ఒక గాధగా

చరణం 1 : 

మగవారి కామానికెరగా...
రగిలింది ప్రతి రాత్రి చితిగా
తనువే తమకు చాలన్నారు... \
హృదయం ఉన్నా వలదన్నారు
వెలయాలంటూ వెలివేశారు...
వాడారు చలిమంటగా

జాబిల్లి వెన్నెళ్ళు చవిచూడలేదు
సిరిమల్లె పువ్వుళ్ళు సిగముడువ లేదు
కనులారా ఒకరాత్రి కునుకైనలేదు
మనసారా మాటాడ మనిషైన లేడు 
బ్రతుకంతా మరుభూమి కాగా
ఆమె మిగిలింది ఒక గాధగా
ఆమె మిగిలింది ఒక గాధగా


చరణం 2 : 

కావాలి అనుకుంది సీత...
కాల్జారీ అయ్యింది పతిత
అనురాగాలు అనుబంధాలు...
అర్థం లేని వ్యర్ధ పదాలై
అందరి సొమ్మై అంగడి బొమ్మై... 
అందరి సొమ్మై అంగడి బొమ్మై...
గడిచాయి కనరాత్రులు

జాబిల్లి వెన్నెళ్ళు చవిచూడలేదు
సిరిమల్లె పువ్వుళ్ళు సిగముడువ లేదు
కనులారా ఒకరాత్రి కునుకైనలేదు
మనసారా మాటాడ మనిషైన లేడు 
బ్రతుకంతా మరుభూమి కాగా
ఆమె మిగిలింది ఒక గాధగా
ఆమె మిగిలింది ఒక గాధగా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి