2, ఫిబ్రవరి 2025, ఆదివారం

Egire Pavurama : Gunde Gootiki Pandgocchindi Song Lyrics (గుండె గూటికి పండుగొచ్చింది.. )

చిత్రం: ఎగిరే పావురమా (1997)

సంగీతం: ఎస్.వి.కృష్ణా రెడ్డి

రచన: వేటూరి సుందరరామ మూర్తి 

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



పల్లవి : 

గుండె గూటికి పండుగొచ్చింది..
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ 
గుండె గూటికి పండుగొచ్చింది..
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

చరణం 1 :

నేలనోదిలిన గాలి పరుగున..
ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను..
వేగంగా చేయాలి
ఇంటి గడపకి మింటి మెరుపుల..
తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి..
స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో... ఎన్నెన్నో చేసినా
ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది
గుండె గూటికి పండుగొచ్చింది..
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ


చరణం 2 :

బావ మమతల భావ కవితలే...
శుభ లేఖలు కావలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు...
సుముహుర్తం రావాలి
ఏడు అడుగుల జోడు నడకలు...
ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని..
అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళు.. ఇన్నాళ్ళు ఎదురు చూసే
నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ
గుండె గూటికి పండుగొచ్చింది..
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి