2, మార్చి 2025, ఆదివారం

Tolimuddu : Raava Priyathama Song Lyrics (రావా ప్రియతమా.. )

చిత్రం: తొలిముద్దు (1993)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి



పల్లవి :

రావా ప్రియతమా.. ప్రేమే శాపమా..
వసంతమే కల్లోలాన్నే రేపేనా
సరాగమే కన్నీరై కాటేసెన
విధిరాత లింతేనా మిగిలింది ఎడబాటేనా
పరువాల పందిరిలోన బడబాగ్ని రేగేనా
మనసే రగిలే శిలగా మారేనా
రావా ప్రియతమా.. నాపై ద్వేషమా
వసంతమే కల్లోలాన్ని రేపితే
సరాగమే కన్నీరై చెలరేగితే
విధిరాత అనుకున్న శిలలాగ నే పడి ఉన్నా
మాసి మాడైపోతున్న మరణం శరణం అని జీవిస్తున్నా

చరణం : 1 

గుండెలోని ముల్లు గుచ్చి గూడే దాటినావే
పిచ్చివాన్ని నన్ను చేసి రచ్చ కీడ్చినావే
కలల కన్నా రామచిలుక కనుల గంగ జారద
గట్టుమీద చేపలాగా కొట్టుమిట్టు లాడుదా
నమ్మినాక గొంతు కోసే ప్రేమ నీది ప్రేయసి
మాట రాక మూగబోయా ఎవరికెరుక నా గతి
వలపే విషమై తొలిచింది నా ఎదని

రావా ప్రియతమా.. ఇంకా మౌనమా

చరణం : 2

నీవు లేని జీవితాన నిలవనంది ఆశ 
జ్ఞాపకాల జాడలోనే నిలిచి ఉంది శ్వాస
మమత కాలి బూడిద అయ్యే శిక్ష వేసినావుగా
మనసు చచ్చిపోయి నేను మిగిలినాను వంటిగా
బాధ నీది గుండె నాది మరచిపోకు నా ప్రియా
బ్రతికే నీకు పంచి ఇచ్చా ఎందుకు ఇంత నిర్దయ
తెలిసే తెలిసే వలచే చేశా వలపు

రావా ప్రియతమా..నాపై ద్వేషమా
వసంతమే కల్లోలాన్నే రేపితే
సరాగమే కన్నీరై చెలరేగితే
విధిరాత అనుకున్న శిలలాగ నే పడి ఉన్నా
మసి మాడైపోతున్న మరణం శరణం అని జీవిస్తున్నా
రావా ప్రియతమా..ప్రేమే శాపమా..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి