26, ఏప్రిల్ 2025, శనివారం

Ammayi Kapuram : Kanchipattu Cheeragattukunndi Song Lyrics (కంచిపట్టు చీర కట్టుకున్నది)

చిత్రం: అమ్మాయి కాపురం (1994)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

కంచిపట్టు చీర కట్టుకున్నది సిగ్గన్నది దాన్ని వెళ్ళగొట్టవమ్మ
పైటబడ్డనాటి నుండి ఉన్నది సిగ్గన్నది దాన్ని ఏడ పంపనమ్మా
కౌగిట్లో గాలైన చేరంగా చోటుందా చూపుమా
చీకట్లో దారైన చెప్పందే పొమ్మంటె న్యాయమా
మాయదారి కళ్ళు మనవైపు చూడకుండ
నీ సిగ్గునే కాపలాగ పెట్టవమ్మ కిటికీలకావల

కంచిపట్టు చీర కట్టుకున్నది సిగ్గన్నది దాన్ని వెళ్ళగొట్టవమ్మ

చరణం : 1 

పాలబుగ్గలోని పాడుసిగ్గునీ పంటి గాటుపెట్టి బెదరగొట్టనీ
సున్నితంగ ఉన్న సోకుమొగ్గనీ అంత గాటు వద్దు కాస్త తగ్గనీ
పాపం పోనీలె అంటే తాపం పోయేది కాదు వదిలెయ్యి కొత్తబెట్టునీ
కొంచెం కొంచెంగ ఇచ్చి ఇంకా నూరేళ్ళపాటు పంచాలి ఉన్న ముద్దునీ
సోకు విందుకూ సాకులెందుకూ చిలిపి చిందుకూ సందడెందుకూ
చిక్కమంటె చిక్కకుండ జింక చిందులెందుకే

కంచిపట్టు చీర కట్టుకున్నది సిగ్గన్నది దాన్ని వెళ్ళగొట్టవమ్మ
 
చరణం : 2

పాడు చుక్క చూడు ఫక్కుమన్నదీ దాన్ని ఏమి చేస్తే తప్పు ఉన్నదీ
ఈడు వెచ్చబెట్టి రెచ్చగొట్టనీ వేగి చుక్క చుట్టు చిచ్చు పెట్టనీ
ఏమో నాకంతా కొత్త నీదే నా భారమంతా కాపాడు లేత గుట్టునీ
అంతా నా చేతబెట్టి ఆపై నా విద్య చూడు తప్పిస్తా ఒంటి పోరునీ
ఉన్నపాటుగా అంత ఆవిరా మొదటిసారికే బెదిరితే ఎలా
ఒక్కపూటతోనే తీపితిక్క తీరిపోదులే

కంచిపట్టు చీర కట్టుకున్నది సిగ్గన్నది దాన్ని వెళ్ళగొట్టవమ్మ 
పైటబడ్డనాటి నుండి ఉన్నది సిగ్గన్నది దాన్ని ఏడ పంపనమ్మా 
కౌగిట్లో గాలైన చేరంగా చోటుందా చూపుమా
చీకట్లో దారైన చెప్పందే పొమ్మంటె న్యాయమా
మాయదారి కళ్ళు మనవైపు చూడకుండ
నీ సిగ్గునే కాపలాగ పెట్టవమ్మ కిటికీలకావల
కంచిపట్టు చీర కట్టుకున్నది హహ్హాహహా దాన్ని వెళ్ళగొట్టవమ్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి