27, ఏప్రిల్ 2025, ఆదివారం

Chandana : O Rama Chakkani Bangaru Bomma Song Lyrics (ఓ రామ చక్కని బంగారు బొమ్మా)

చిత్రం: చందన (1974)

సంగీతం: రమేశ్ నాయుడు

రచన: సి.నారాయణ రెడ్డి

గానం: రమేశ్ నాయుడు


పల్లవి :

ఓ రామ చక్కని బంగారు బొమ్మా
ఓ రామ చక్కని బంగారు బొమ్మా
నీ రాత రంపపుకోత ఆయెనా

చరణం : 1

నీవారూ నావారూ..  నెత్తిన నిప్పులు పోసారే..
నెత్తిన నిప్పులు పోసారే
కత్తులు గుండెల్లో గుచ్చారే.. నెత్తుటిలో ముంచెత్తారే...
నెత్తుటిలో ముంచెత్తారే
ముత్యాల బొమ్మా.. రతనాల బొమ్మా..
మురిపాల బొమ్మా..  ఓ ముద్దు గుమ్మా 
ఓ రామ చక్కని బంగారు బొమ్మా..
నీ రాత రంపపుకోత ఆయెనా 

చరణం : 2

మాలచ్చిమి లేని ఊరూ..  దిక్కుమాలిన వల్లకాడు.. 
దిక్కుమాలిన వల్లకాడు
పాడుదేవుడు ఏడున్నాడో.. పాప మెందుకు మింగిపోడో.. 
పాప మెందుకు మింగిపోడో
ముత్యాల బొమ్మా.. రతనాల బొమ్మా..
మురిపాల బొమ్మా..  ఓ ముద్దు గుమ్మా
ఓ రామ చక్కని బంగారు బొమ్మా..
నీ రాత రంపపుకోత ఆయెనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి