25, ఏప్రిల్ 2025, శుక్రవారం

Kalyani : Gubulu Puttisthavo Song Lyrics (గుబులు పుట్టిస్తావు )

చిత్రం : కళ్యాణి (1979)

సంగీతం : రమేశ్ నాయుడు

సాహిత్యం: దాసం గోపాల కృష్ణ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల



పల్లవి :

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా... గుండెలే దోస్తావు ఓ మల్లికా
పువ్వుల్లో మేనకవే ఓ మల్లికా... పూబోణి కానుకవే సిరిమల్లిక
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా... గుండెలే దోస్తావు ఓ మల్లికా
పువ్వుల్లో మేనకవే ఓ మల్లికా... పూబోణి కానుకవే సిరిమల్లిక
పూబోణి కానుకవే సిరిమల్లిక

చరణం 1 :

జవరాలి జడలోన... ఆ.. ఆ.. ఆ...
జవరాలి జడలోన జలతారు తారవై
కాముకుల మెడలోన కర్పూర హారమై
దేహాన్ని... ఆ.. ఆ.. ఆ...
దేహాన్ని పులకించి మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవు
జవరాలి జడలోన జలతారు తారవై
కాముకుల మెడలోన కర్పూర హారమై
దేహాన్ని పులకించి మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవు

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా... గుండెలే దోస్తావు ఓ మల్లికా
పువ్వుల్లో మేనకవే ఓ మల్లికా... పూబోణి కానుకవే సిరిమల్లిక

చరణం 2 :

సుతిమెత్తగా నువ్వు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి తాణమాడిస్తావు
ఉల్లాసకేళికి ఒళ్ళు ఇస్తావు
ఉసిగొల్పి ఉసిగొల్పి కళ్ళు మూస్తావు
సుతిమెత్తగా... ఆ.. ఆ.. ఆ...
సుతిమెత్తగా నువ్వు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి తాణమాడిస్తావు
ఉల్లాసకేళికి... ఆ.. ఆ.. ఆ...
ఉల్లాసకేళికి ఒళ్ళు ఇస్తావు
ఉసిగొల్పి ఉసిగొల్పి కళ్ళు మూస్తావు

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా... గుండెలే దోస్తావు ఓ మల్లికా
పువ్వుల్లో మేనకవే ఓ మల్లికా... పూబోణి కానుకవే సిరిమల్లిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి