7, మే 2025, బుధవారం

Avakai Biryani : Maamidi Kommaki Song Lyrics (మామిడికొమ్మకి)

చిత్రం: ఆవకాయ్ బిర్యానీ (2008)

సంగీతం: మణికాంత్ కద్రి

రచన:

గానం: మణికాంత్ కద్రి, సైంధవి


మామిడికొమ్మకి మా చిలకమ్మకి పొత్తే కుదిరిందీ

కమ్మని రుచులే పంచే పనులకు పొద్దే పొడిచిందీ

కొత్తావకాయే తన కంటి ఎరుపాయే

ముంగిళ్ళలో మురిపాలే మూతి విరుపాయే

కారాలు నూరే సందళ్ళు కొలువాయే

కాలాలు మారే కథలే ఇక మొదలాయే


పూవల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయీ

గుండెల్లో అశలు ఉన్నాయీ

కళ్ళల్లో తీయని కలలే తెచ్చిన అమ్మాయీ

నీ కోసం మా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ



ఏ నదితొ ఏ వైరం ఈ నావను వెంటాడిందో

ఒంటరిగా చేరిందీ ఈ తీరం

గుండెల్లో ఈ భారం ఎందాక నడిపిస్తుందో

తేల్చదుగా ఎన్నటికీ ఈ.. దూరం

దారే పూలే పరిచి కడదాకా నిన్నే రమ్మంటే

చేరే గమ్యం ఎంతో గొప్పైన అర్ధం ఉంటుందా

అర్ధం లేనే లేని ఏ క్షనమైన నీదవుతుందా

తెగువే ఉంటే గెలుపే సైతం నీతొ దరి రాద



పూవల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయీ

గుండెల్లో అశలు ఉన్నాయీ

కళ్ళల్లో తీయని కలలే తెచ్చిన అమ్మాయీ

నీ కోసం మా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ



ఏ ఓటమి ఎదురయిన ఆశే మీ వెన్నంటేనా

వేకువకై పరుగే ఆగేనా....

చినుకల్లే మొదలైన చిగురించిన పరిచయమేదో

చివరికి ఆ సంద్రంలా మారేనా

నింగి నేలా రెండూ ఎపుడైన కలిసే వీలుందా

పొంగే వాగే వంతెన వేసిందా ఆ కల నిజమవదా

ఏనాడూ కలవని దిక్కులు కలిసిన వింతలు

కంటికి ఎన్నో కనపడలేదా

చీకటి వెలుగులు గీసిన చిత్రం నీదా



పూవల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయీ

గుండెల్లో అశలు ఉన్నాయీ

కళ్ళల్లో తీయని కలలే తెచ్చిన అమ్మాయీ

నీ కోసం మా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి