22, మే 2025, గురువారం

Manchi Donga : Naa Rendu Kallaki Song Lyrics (నా రెండు కళ్ళకీ...)

చిత్రం: మంచి దొంగ (1988 )

సంగీతం: కె. చక్రవర్తి

రచన:  వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల




పల్లవి:

నా రెండు కళ్ళకీ...
నా రెండు కళ్ళకీ పువ్వుల పిచ్చీ..
నా రెండు పెదవులకీ ముద్దుల పిచ్చీ..
నా రెండు చేతులకీ భజనల పిచ్చీ..
నా వయసు దూకుడుకీ సోకుల పిచ్చీ..
నాకేమో అంతులేని వలపుల పిచ్చీ..
వలపుల పిచ్చీ
నా సోకు వంటికీ ....
నా సోకు వంటికీ చీరల పిచ్చీ ..
నా ఒంపు సొంపులకీ . రైకల పిచ్చీ ...
నా లేత నడుముకీ కులుకుల పిచ్చీ..
నువ్వంటే లోలోనా ఒకటే పిచ్చీ ..
ముద్దంటే నీ కన్నా నాకే పిచ్చీ..
నాకే పిచ్చీ..

చరణం : 1

నా చీరా కుచ్చిళ్ళూ..చలిగాలీ సంకెళ్ళూ..
నా చీరా కుచ్చిళ్ళూ.. చలిగాలీ సంకెళ్ళూ..
తగిలించనా నీకు వెనకనుంచీ..
కౌగిళ్ళా చిట్టాలూ..పడకింటి చట్టాలూ..
అరే.కౌగిళ్ళా చిట్టాలూ..పడకింటి చట్టాలూ..
నీ ఒళ్ళో చదివించు బుజ్జగించీ..
వెన్నెలంటి ఒంటిమీద వాలిపో.ఒప్పించీ..
వెన్నెలంటి ఒంటిమీద వాలిపో.ఒప్పించీ..
సొగసు మీద పన్ను వేసి తీసుకో మెప్పించీ..
రాగాలే తీయించరా..
రాజ్యాలే దక్కించవే...

నా సోకు వంటికీ చీరల పిచ్చీ ..
నా రెండు పెదవులకీ ముద్దుల పిచ్చీ..

చరణం :2

ఆర్రెర్రెరెరెర్రెరే... నడిరేయి కష్టాలూ..నా కెంతో ఇష్టాలూ..
నడిరేయి కష్టాలూ.. నా కెంతో ఇష్టాలూ..
తప్పించుకోబోకే పక్కనుంచీ..
సరసాల చెడుగుడులూ..పట్టాలా తొడిగుడులూ..
అహా.. సరసాల చెడుగుడులూ..పట్టాలా తొడిగుడులూ..
కులికించీ పలికించూ పులకరించీ..

అడ్డెవరూ లేనిచోట అందవే మురిపించీ..
అడ్డెవరూ లేనిచోట అందవే మురిపించీ..
పాలపుంత అందనంత ఏలుకో ఇకనుంచీ..
తేనె వాన కురిపించవే..
ప్రేమలోన కరిగించరా..
నా రెండు కళ్ళకీ...
నా రెండు కళ్ళకీ పువ్వుల పిచ్చీ..
నా రెండు పెదవులకీ ముద్దుల పిచ్చీ..
నా లేత నడుముకీ కులుకుల పిచ్చీ..
నువ్వంటే లోలోనా ఒకటే పిచ్చీ ..
నాకేమో అంతులేని వలపుల పిచ్చీ..
వలపుల పిచ్చీ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి