100% Love లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
100% Love లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఫిబ్రవరి 2025, శనివారం

100% Love : Infatuation Song Lyrics (కళ్లు కళ్లు ప్లస్సూ... )

చిత్రం : 100% లవ్ (2011)

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

రచన : శ్రీ మణి

గానం: స్వాతి రెడ్డి




పల్లవి :

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు
ఇన్‌ఫ్యాట్యుయేషన్

ఎడమభుజము కుడిభుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది
ఎంతో సహజం
సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు
ఇన్‌ఫ్యాట్యుయేషన్

ఇన్‌ఫ్యాట్యుయేషన్.. ఇన్‌ఫ్యాట్యుయేషన్


చరణం : 1

దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంట
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటీగ్రేడ్ సరిపోదంట
ఫారెన్ హీట్ పనిచేయదంట
వయసు వేడి కొలవాలంటే తంటా
లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు ఏ సైన్స్‌కైనా... ఓ...
పైకి విసిరినది కింద పడును
అని తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందులౌతది
ఇన్‌ఫ్యాట్యుయేషన్

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు
ఇన్‌ఫ్యాట్యుయేషన్

చరణం : 2

సౌత్ పోల్ అబ్బాయంట
నార్త్ పోల్ అమ్మాయంట
రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట
ఋణావేశ ం అమ్మాయంట
కలిస్తే కరెంటే పుట్టేనంట
ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా.. మరో ప్రశ్న జవాబట
ప్రాయానికే పరీక్షలంట... ఓ...
పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట
అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు
ఇన్‌ఫ్యాట్యుయేషన్

19, జనవరి 2025, ఆదివారం

100% Love : A square B square A plus B whole square Song Lyrics

చిత్రం : 100% లవ్ (2011)

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

రచన : శ్రీ మణి

గానం: స్వాతి రెడ్డి




A square B square A plus B whole square
టాం అండ్ జెర్రి వారుకి ఎటెమైనా డోంట్ కేర్
అటాక్ అటాక్ ఎలుక పిల్లిమీదకే
అటాక్ అటాక్ పువ్వు ముళ్లుమీదకే
అటాక్ అటాక ఉప్పు నిప్పుమీదకే
అటాక్ అటాక్

రింగ రింగ రోజెస్ వంకర టింకర పోజెస్
తింగర తింగర థీరంస్ కి పట్టె సొల్యూషన్స్
ఏ పోటా పోటి చీటింగ్
చీటికి మాటికి ఫైటింగ్
మీది మీది రాంకులకోసం కాంపుటీషన్

అటాక్ అటాక్ చేప కప్పమీదకే
అటాక్ అటాక్ జింక పులిమీదకే
అటాక్ అటాక్ ఓణి జీన్స్ మీదకే
అటాక్ అటాక్

Hey lets go