24 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
24 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, నవంబర్ 2024, సోమవారం

24 : Prema Swaramulalo Song Lyrics (ప్రేమ పరిచయమే దైవ దర్శనమే...)

చిత్రం : 24  (2016)

సంగీతం : ఎ.ఆర్ .రెహమాన్

రచన : చంద్రబోస్

గానం: హృదయ గట్టాని, చిన్మయి శ్రీపాద




పల్లవి:

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే... ప్రేమ స్వరములలో దైవ స్మరణములే... అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో... మది మునిగింది నీ ప్రేమలో... ప్రేమ పరిచయమే దైవ దర్శనమే... ప్రేమ అడుగులలో దేవతార్చనలే...

చరణం-1:

కోకిలసలు కోరుకొనని ప్రేమ తపస్సు మనదిలే... అతిధులెవరు ఎదురు పడని ప్రేమ తిధులు మనవే... అమృతములు ఎగసిపడిన ప్రేమ నదులు మనవే ... చరితల కాగితాల లోన చదవలేని ప్రేమనే... నీలో చదివా ఈ క్షణాలలో... ప్రేమ పరిచయమే దైవ దర్శనమే... ప్రేమ అడుగులలో దేవతార్చనలే...

చరణం-2:

హృదయ గళము పాడుతున్న ప్రేమ గీతి మనదిలే... కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే... పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే... మనుషుల ఊహాలోన సైతం ఉండలేని ప్రేమతో... ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో... ప్రేమ పరిచయమే దైవ దర్శనమే... ప్రేమ అడుగులలో దేవతార్చనలే... అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో... మది మునిగింది నీ ప్రేమలో... ప్రేమ పరిచయమే దైవ దర్శనమే... ప్రేమ స్వరములలో దైవ స్మరణములే... అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో... మది మునిగింది నీ ప్రేమలో... ప్రేమ పరిచయమే దైవ దర్శనమే...

24 : Manasuke Song Lyrics (మనసుకే )

చిత్రం : 24  (2016)

సంగీతం : ఎ.ఆర్ .రెహమాన్

రచన : చంద్రబోస్

గానం: సిద్ శ్రీరామ్, సనా మొయిదుట్టి, జోనితా గాంధీ



పల్లవి:

నీ వల్లే త త తాపం నీ వల్లే ద ద దాహం నీ వల్లే గంధరగోలం నీ వల్లే పిల్లా.. ఈ లోకంలో, నే లేనట్టే.. ఓ మైకంలో, నీ వెంటే.. నీ వల్లే త త తాపం నీ వల్లే ద ద దాహం నీ వల్లే గంధరగోలం నీ వల్లే పిల్లా.. మనసుకే మధువువే వయసుకే విషమువె.. నీ ముందే ముందే వెలుగై నిలిచానే నీ వెనకే వెనకే నీడై నడిచానే.. పడుతున్నా లేచినా చలించవే చెలి నువ్వే.. నీ వల్లే త త తాపం నీ వల్లే ద ద దాహం మనసుకే మధువువే వయసుకే విషమువె.. లోకంలో లేనట్టే మైకంలో నీ వెంటే.. మనసుకే మధువువే వయసుకే విషమువె.. నా కదలో కదలో మొదలే అయినావే.. నా నిదరే నిదరే ప్రతి ఊహలో నీవేలే.. మనసుకే మధువువే వయసుకే విషమువె.. ఓఓ.. చరణం-1: నిను తాగే గాలులనే తడిమానే హొఒఓ.. నువ్వు విసిరే వలలో ఒదిగానే.. ఒహొహో.. నదిలా నడిచే సంద్రం నువ్వే, గదిలా తిరిగే గగనం నువ్వే.. క్షణం అనిపించే ఒహో, యుగమే నువ్వే.. మనసుకే, ముడిపడు ముడిపడు.. మధువువే, మదికొని సుఖపడు.. వయసుకే, జతపడి శ్రమపడు.. విషమువే, విషయము విడిపడు.. నీ ముందే ముందే వెలుగై నిలిచానే నీ వెనకే వెనకే నీడై నడిచానే.. పడుతున్న లేవగనే చలించవే చెలి నువ్వే.. నీ వల్లే త త తాపం నీ వల్లే ద ద దాహం చరణం-2: ఓ.. ఓ.. ప్రతిరోజు ఓ పరిమళమై వస్తావా ఒహొహో.. తేనీగల్లే నువ్వు నా తోడుంటే.. ఒహొహొహో.. మాటలు నేర్చే పొగమంచువే.. ఆటాడించే హరివిల్లువే.. హేయ్.. ప్రాణం పోసే మన్మధ బాణం నువ్వే.. మనసుకే.. మనసొక వంతెన.. మధువువే.. మరి మరి వంచన.. వయసుకే.. మన వయసొక నించెన.. వి వి విషమువే.. వి వి విసిరేయి.. నా కనులే కలలై నీకై వెతికేనే. అవి కరిగే వేళ బతుకే చిటికేనే.. నీ వల్లే సంతోషం, అంటుందా ఈ నిమిషం.. నీ వల్లే జీవితం అయిందిలే సంగీతమే.. నీ వల్లే త త తాపం నీ వల్లే ద ద దాహం నీ వల్లే గంధరగోలం నీ వల్లే పిల్లా..