30 Rojullo Preminchadam Ela లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
30 Rojullo Preminchadam Ela లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మే 2021, ఆదివారం

30 Rojullo Preminchadam Ela - Neeli Neeli Aakasam Song Lyrics (నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా)

 

30 Rojullo Preminchadam Ela - Neeli Neeli Aakasam Song Lyrics (నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా)


నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా ఓ ఓ ఓ ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా ఆ అ ఆ అ ఆ నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా ఓ.. ఒ.. వానవిల్లు లో ఉండని రంగు నువ్వులే ఏ రంగున చీరను నీకు నెయ్యా..లే నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవి లే ఆ కళ్ళకూ కాటుకా ఎందుకెట్టా..లే చెక్కిలి పై చుక్క గా దిష్టే పెడతారు లే నీకైతే తనువంతా అ చుక్కను పెట్టా..లే ఏదో ఇవ్వాలి కానుకా ఎంతో వెతికాను ఆశగా ఏదీ నీ సాటి రాదికా అంటూ ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టన నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా ఓహొ అమ్మ చూపులో వొలికె జాలి నువ్వు లే ఆ జాలికీ మారుగా ఏమి ఇవ్వాలి నాన్న వేలితో నడిపె ధైర్యమె నీదే నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి దయ గలిగిన దేవుడే.. మనలను కలిపాడు లే వరమొసగె దేవుడికే నే నేం తిరిగివ్వాలే ఏదో ఇవ్వాలి కానుకా ఎంతో వెతికాను ఆశగా ఏదీ నీ సాటి రాదికా అంటూ అలిసాను పూర్తిగా కనుకే మళ్లి మళ్లి జన్మనెత్తి నిన్ను చేరన నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా..