7/G Brundhavana Colony లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
7/G Brundhavana Colony లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఫిబ్రవరి 2025, గురువారం

7/G Brundhavana Colony : Kalalu Kane Kaalaalu Song Lyrics (కలలు గనె కాలాలు)

చిత్రం: 7/జి బృందావన కాలనీ (2004)

సాహిత్యం: శివ గణేష్

గానం: హరీష్ రాఘవేంద్ర, శ్రీమధుమిత

సంగీతం: యువన్ శంకర్ రాజా



పల్లవి:

కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
వొంటరిగ పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం
ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం
వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువమ్
నిత్య కలలతొ తమ తమ రూపం
వెళ్ళి కోరును నిప్పుతో స్నేహం
దేవూనీ రహస్యమూ
లోకం లో తీయని భాష
హృదయం లో పలికే భాష
మెల మెల్లగా వినిపించే ఘోషా
ఆ ఆఆ 

కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
వొంటరిగ పయనం చేయునా

చరణం 1:

తడి రాని కాళ్లతోటే కడలికెది సంబంధం
నే వేరు నువ్వెరంటే చెలిమికేది అనుబంధం
ఎగరలేని పక్షి కేలా పక్షి అనే ఆ నామం
తెరవలేని మనస్సుకేలా కలలు గనె ఆరాటమ్
ఒంటరి గా పాదాలు ఎమి కోరి సాగినవొ
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినావో
తల్లైనా కొన్ని హద్దులు ఉండును స్నేహం లో అవి ఉండవులే
ఎగీరొచ్చీ కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాధ్యములే
ఆఆ ఆఅ...ఆఅ

కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
వొంటరిగ పయనం చేయునా

చరణం 2:

ఏవైందో ఎమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఏకాంతం పూసు కొని సంధ్యావేల పిలిచేనూలే
తెల్లవారు ఝామూలన్నీ నిద్రలేక తేలవారే
కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనూలే
నడచేతి దారిలో నీ పేరు కనిపించా
గుండెల్లో ఎవో గుసగుసలు వినిపించే
అప్పుడప్పుడు చిరు కోపము రాగ కరిగేనులే అది మంచులాగా
భూకంపం అది తట్టుకోగలము మది కంపం అది తట్టుకొలేం

కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
వొంటరిగ పయనం చేయునా




7/G Brundhavana Colony : Kannulu baasalu Song Lyrics (కన్నుల బాసలు తెలియవులే)

చిత్రం: 7/జి బృందావన కాలనీ (2004)

సాహిత్యం: శివ గణేష్

గానం: కార్తీక్

సంగీతం: యువన్ శంకర్ రాజా



పల్లవి:

కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
ఇది అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే
ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే

చరణం 1:

అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే
కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనపడు వెలుగు దారికే చెందదులే
మెరుపుల వెలుగును పట్టగ మినుగురు పురుగుకి తెలియదులే
కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట
అల కడలిదాటగానే నురుగులిక ఒడ్డుకు సొంతమటా
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే

చరణం 2:

లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే వరియించులే
ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే
మంచు బిందువొచ్చి డీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే
ఉప్పెనొచ్చిన కొండ మిగులును చెట్లు చామలు మాయవునులే
నవ్వు వచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసివచ్చులే
ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే
కన్నుల బాసలు…..
ఏ కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే

13, నవంబర్ 2021, శనివారం

7/G Brundhavana Colony : Thalachi thalachi Song Lyrics (తలచి తలచి )

చిత్రం: 7/జి బృందావన కాలనీ (2004)

సాహిత్యం: శివ గణేష్

గానం: శ్రేయ ఘోషల్

సంగీతం: యువన్ శంకర్ రాజా



పల్లవి:

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ ... తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ... నీలో నన్ను చూసుకుంటిని

చరణం 1:

కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథనెపుడూ రాలిపోయెనా పూల గంధమా... రాక తెలుపు మువ్వల సడిని తలుచుకొనును దారులు ఎపుడూ పగిలిపోయెనా గాజుల అందమా... అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు తోలి స్వప్నం కానులె ప్రియతమా కనులూ తెరువుమా

చరణం 2:

మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు
నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా...
చెరిగిపోని చూపులు అన్ని రేయి పగలు
నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా...
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు...
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
ఒక సారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా ...
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై
నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ