Aada Paduchu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aada Paduchu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2025, మంగళవారం

Aada Paduchu : Madhi Thulli Thulli Yegirindi Song Lyrics (మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది)

చిత్రం: ఆడపడుచు (1967)

సాహిత్యం: ఆరుద్ర

గానం: పి.సుశీల

సంగీతం : తాతినేని చలపతి రావు



పల్లవి:

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది
ఊహ ఉలికి ఉలికి పడుతుంది
సిగ్గు చెవిలోన గుస గుస లాడింది
మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది
ఊహ ఉలికి ఉలికి పడుతుంది
సిగ్గు చెవిలోన గుస గుస లాడింది

చరణం 1:

పెళ్ళి చూపుల్లో ఏదో వెరపు
వెళ్ళి పోయాక ఒకటే తలపు
పెళ్ళి చూపుల్లో ఏదో వెరపు
వెళ్ళి పోయాక ఒకటే తలపు
రెండు నిమిషాలలో కోటి పులకింతలై
రెండు నిమిషాలలో కోటి పులకింతలై
నిండు మదిలోన నెలకొంది తన రూపు
మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది
ఊహ ఉలికి ఉలికి పడుతుంది
సిగ్గు చెవిలోన గుస గుస లాడింది

చరణం 2:

ఏల అదిరింది నా ఎడమ కన్ను
ఏల తన పేరు ఊరించె నన్ను
ఏల అదిరింది నా ఎడమ కన్ను
ఏల తన పేరు ఊరించే నన్ను
వలపు ఉయ్యాల పై పూల జంపాల పై
వలపు ఉయ్యాల పై పూల జంపాల పై
ఆశ ఆకాశ వీధుల్లో ఊగింది
మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది
ఊహ ఉలికి ఉలికి పడుతుంది
సిగ్గు చెవిలోన గుస గుస లాడింది

చరణం 3:

ఇంత సంతోషమిపుడే కలిగే
ఇంక రాబోవు సుఖమెంతో కలదు
ఇంత సంతోషమిపుడే కలిగే
ఇంక రాబోవు సుఖమెంతో కలదు
పగటి కలలన్నియు పసిడి గనులైనచో
పగటి కలలన్నియు పసిడి గనులైనచో
పట్టలేదోమో నా మూగ మనసు
మది తుళ్ళి తుళ్ళి తుళ్లి ఎగిరింది
ఊహ ఉలికి ఉలికి పడుతుంది
సిగ్గు చెవిలోన గుస గుస లాడింది

Aada Paduchu : Garadi Chese Kannulatho Song Lyrics (గారడి చేసే కన్నులతో )

చిత్రం: ఆడపడుచు (1967)

సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య

గానం: టి. ఆర్. జయదేవ్, పి.సుశీల

సంగీతం : తాతినేని చలపతి రావు



పల్లవి :

గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ

చిలిపి చిలిపి నీ చేతలతో నను కలవరపరచే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ..


చరణం 1:

రారమ్మని నే పిలవగనే.. రానని మారాం చేసేవు
ఎందుకనీ... ఎందుకనీ
గారాలొలికే చెక్కిలిపై నేరం చేయగ తలచేవు
ఎందుకనీ... ఎందుకనీ

గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకనీ
ఎందుకనీ... ఎందుకనీ
చిలిపి చిలిపి నీ చేతలతో నను కలవరపరచే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ..


చరణం 2 :

జడలో పూవులు తురుమగనే తడబడి దూసుకుపోయేవు
ఎందుకనీ... ఎందుకనీ
పూవులు తురుమే సాకులతో నా నవ్వును దోచగ తలచేవూ
ఎందుకనీ... ఎందుకనీ

గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకనీ
ఎందుకనీ... ఎందుకనీ
చిలిపి చిలిపి నీ చేతలతో నను కలవరపరచే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ..


చరణం 3 :

నీ పాదాలే సోకిన చోట నిగనిగలాడేను ఈ తోటా
ఎందుకనీ... ఎందుకనీ
నను కాపాడే నీ నీడే అందాలొలికేను నా మేడ
ఎందుకనీ... ఎందుకనీ

గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకనీ
ఎందుకనీ... ఎందుకనీ
చిలిపి చిలిపి నీ చేతలతో నను కలవరపరచే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ..



Aada Paduchu : Anna Nee Anuragam Song Lyrics (అన్నా... నీ అనురాగం)

చిత్రం: ఆడపడుచు (1967)

సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య

గానం: పి.సుశీల

సంగీతం : తాతినేని చలపతి రావు



పల్లవి :

అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా నీ అనురాగం... 
పుట్టిన రోజున మీ దీవేనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం..


చరణం 1 :

మల్లెలవంటి మీ మనసులలో చెల్లికి చోటుంచాలి
ఎల్లకాలము ఈ తీరుగానే చెల్లిని కాపాడాలి..
పుట్టిన రోజున మీ దీవేనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం....  ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా... 


చరణం 2 :

అన్నలు మీరే నా కన్నులుగా...  నన్నే నడిపించాలి
తల్లీ తండ్రీ సర్వము మీరై...  దయతో దీవించాలి

పుట్టిన రోజున మీ దీవేనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా... 


చరణం 3 :

ఇల్లాలినై నేనెచటికేగినా...  చెల్లిని మదిలో నింపాలి
ఆడపడచుకు అన్నివేళలా...  తోడూ నీడగా నిలవాలి
పుట్టిన రోజున మీ దీవేనలే...  వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం...  ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా..