Aadi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aadi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఏప్రిల్ 2024, బుధవారం

Aadi : Pattu Okato Sari Song Lyrics (పట్టు ఒకటో సారి)

చిత్రం: ఆది (2002)

రచన : చంద్ర బోస్

సంగీతం : మణి శర్మ

గానం : ఉదిత్ నారాయణ్, గంగ





పల్లవి:

పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి గుండెలు గుణించు ఓ సారి సిగ్గులు భాగించు ఓ సారి లవ్వులు లెక్కించు ఓ సారి ఆపై అందిస్త ఓ పట్టుశారీ
చరణం:1
అమ్మాయి నీ అందం సముద్రమే అందులో నా మనసే అణిగే మనిగే మునిగే అబ్బాయి నీ వేగం విమానమే అందుకే నా సొగసే వొణికే జనికే బెనికే చిన్న వయసులో పాఠశాలకి పొగరున్న వయసులో వచ్చానే పైటశాలకి ఆరు ఏళ్లలో చెమ్మచెక్కకి పదహారు ఏళ్లలో వచ్చాగా చుమ్మ చెక్కకి పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి
చరణం:2
ఇంగ్లీషులో ఎన్నెన్నో పదాలలో ఈ మూడే నచ్చినివి లివరు ఫ్లవరు లవరు లోకంలో ఎన్నెన్నో బంధాలలో ఈ మూడే తెలిసినవి మదరు ఫాదరు తమరు నేను ఇప్పుడూ బ్రహ్మ చారిని నువు కోరినప్పుడు అయిపోతా భామ చారిని నేను ఇప్పుడూ అందగత్తెని నువు తాకినప్పుడు అయిపోతా అగరుబత్తిని పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి గుండెలు గుణించు ఓ సారి సిగ్గులు భాగించు ఓ సారి లవ్వులు లెక్కించు ఓ సారి ఆపై అందిస్త ఓ పట్టుశారీ

Aadi : Tholi Pilupey Song Lyrics (తొలిపిలుపే నీ తొలిపిలుపే)

చిత్రం: ఆది (2002)

రచన : చంద్ర బోస్

సంగీతం : మణి శర్మ

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే నీలో నాలో కలలను కదిపే తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే చరణం:1

ఒక చూపుతోటి ఒక చూపుకలిపి
వెనుచూపు లేని జత పయనమిది ఒక చేయిలోన ఒక చేయివేసి
ఒకటయ్యే చెలిమిది ఒక మాటతోటి ఒక మాట కలిపి
మొగమాటమైన మగువాట ఇది ఒక గుండెతోటి ఒక గుండెచేరి ఒదిగుండే కథ ఇది ప్రతిపదమూ ప్రియా అని వలచినది ప్రతిఫలమూ ఆశించని మమతల వ్రతమిది తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే చరణం:2
మనసైన వేళ కనుసైగ చాలు
పలు దేశభాషలిక దేనికిలే అధరాల పాల చిరుధార చాలు
ఆహారం దేనికే ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు
ఏ ఇల్లు వాకిలిక ఎందుకులే మన చుంబనాల సవ్వళ్ళు చాలు
సంగీతం ఎందుకే ఇరువురికీ ఏడో రుచి తెలిసినదీ మనుగడకీ మరోముడై ముడి పడు ముడుపిది తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే నీలో నాలో నిదురను చిదిపే తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే