Aagraham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aagraham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2024, శుక్రవారం

Aagraham : Ninnu kori vachcha (నిన్ను కోరి వచ్చా రాజశేఖరా)

చిత్రం: ఆగ్రహం (1989)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: పి.సుశీల

సంగీతం: కోటి


పల్లవి : నిన్ను కోరి వచ్చా రాజశేఖరా... కన్నెసోకులిస్తా తీయతీయగా సరిగమలో సమశ్రుతిలా .. ఘుమఘుమలో స్వరజతిలా.. సరసాల రాసలీల కానీరా... నిన్ను కోరి వచ్చా రాజశేఖరా... కన్నెసోకులిస్తా తీయతీయగా చరణం:1 మోజుతీర పాలలో నీరులా కలిసిపోరా.. మోహనాల డొలలొ సోయగాల ఊయలూపవా ఆశతీర కమ్మగా ప్రేమగ కౌగిలించుకోరా.. జావళీల జాణతొ చందనాల క్రీడలాడవా వెన్నకాగిపోనీరా వన్నెచిన్నెలే.. కొత్తహాయికానీరా కళ్ళమూతలే బరిదాటే విరిబొణి బిడియాలే విగిపోనీ జిగినక మదనక వదలక కదలికలో నిన్ను కోరి వచ్చా రాజశేఖరా... కన్నెసోకులిస్తా తీయతీయగా చరణం:2 ఒక్క ముద్దు నీదిగా నిండుగా నాకుదక్కనీరా.. నా నరాల తీగలో మోహరాగవీణమోగగా ఒక్క పొద్దు జంటగా వెంటగా వెన్నలాడుకోరా.. నా వరాల కోరికే తేనెదారిలోన తీరగా పారిజాత పూలన్నీ మాలవేయనీ... ఓ... శొభనాల రేరాణి మేను కందనీ ఇది నీదే అలివేణి జతలోని చలిపోని అమలక విమలక యమసుఖ ఢమరుకలో నిన్ను కోరి వచ్చా రాజశేఖరా... కన్నెసోకులిస్తా తీయతీయగా సరిగమలో సమశ్రుతిలా .. ఘుమఘుమలో స్వరజతిలా.. సరసాల రాసలీల కానీరా...