చిత్రం: ఆకాశం నీ హద్దు రా (2020)
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: ధనుంజయ్ , అనురాగ్ కులకర్ణి
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
తానే నననానే… నననానే నననానే తానే నననానే… నననానే నననానే నడి గుండెళ్ళో నిప్పుంది… మండిచూ దాన్నీ ఆ మంటల్లో వెలిగించు… నీ రేపటిని సుడిగుండాలు ఎదురైనా… లెక్కించకు దేన్నీ ఎదురీదాలి చేరాలి… లక్ష్యాలని ఒడ్డున ఉండి రాల్లేస్తారు…. నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువు తేలిననాడు… మూసుకుపోవా వాగిన నోళ్ళు ||2|| ముక్క చెక్కలుగ విరిచెయ్… నీకెదురుపడిన చిక్కులని ఉక్కు రెక్కలతొ ఎగరెయ్… నిను నమ్ముకున్న నీ కలని తానే నననానే… నననానే నననానే అదిగో ఆకాశం నీ హద్ధురా… తానే నననానే… నననానే నననానే దాన్నందే అవకాశం… వదలొద్దురా ఆఆ
ఇటురా అని చిటికేసావో… గెలుపెందుకు దిగి రావాలి నీకూ మరి మిగితా వాళ్ళకి… తేడా ఎట్టా తెలియాలి గర్వంగా చెప్పుకునేందుకు… నీకూ ఓ కథ కావాలి చెమటోడ్చి పొందిన విజయం… పరిమళమై నిను చేరాలి కన్ను చిన్నగున్నాదంటూ… చిన్న కలలు కంటావా లేనిపోని పేదరికంతో… వాటికి గిరి గీస్తావా మట్టిలోకి వెలిపోయావో… మళ్ళి పుట్టి వస్తావా ఉన్నదొక్క జీవితమే… ఊరికే వదిలేస్తావా మనసు పెట్టి పనిచేస్తూ… ఓర్పుతోనే అడుగేసెయ్ నీదైన మార్పుగా నేడే… సరికొత్త చెరితనే రాసెయ్
తన్నే తననానే తననానే నానే నానే తన్నే తననానే తననానే నానే నానే……. తానే నననానే… నననానే నననానే తానే నననానే… నననానే నననానే…….. ఆకాశం నీ హద్దురా… పదా పదా పదా పద పద పదా పదా పదా పదా… పదా పదా పదా పదా……