Aalaya Sikharam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aalaya Sikharam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2024, సోమవారం

Aalaya Sikharam : Nee Roopu Marindi Song Lyrics (నీ రూపు మారింది గోపాలుడా.)

చిత్రం : ఆలయ శిఖరం (1983)

సంగీతం: సత్యం

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల


పల్లవి :

నీ రూపు మారింది గోపాలుడా.. లేని నాజూకు పెరిగింది నా రాముడా.. పూలఉయ్యాల ఊపాలా..ఓ బాలుడా.. బాలుడా..గోపాలుడా.. హా..ఆ బాలుడా..గోపాలుడా.. హ్హా..హ్హా..హ్హా.. ఈ రాధ కన్నేస్తే గోపాలుడే.. మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే.. వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే.. బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే.. చరణం : 1 మెరిసే నీ కళ్ళలోనా.. గండు మీనై నేనీది రానా..ఆ..ఆ వలపే నీ గుండెలోనా.. మురళి పిలుపై నే ఊగిపోనా.. మెరిసే నీ కళ్ళలోనా.. గండు మీన నేనీది రానా.. ఆ..ఆ ఓ..ఓ..వలపే నీ గుండె లోనా.. మురళి పిలుపై నే ఊగిపోనా.. నీ కమ్మని పెదవి పిల్లనగ్రోవి కావాలంటనా.. అది ఊదుతుంటే ఒళ్ళే మరచి ఊగుతుంటాను ఆహ.. నీ రూపు మారింది గోపాలుడా.. లేని నాజూకు పెరిగింది నా రాముడా.. వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే.. బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే.. చరణం : 2 ఎదురుగ నీవుండిపోతే.. జీవనదిలా ఉప్పొంగిపోనా.. నదిలా ఉప్పొంగిపోతే.. నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ ఎదురుగ నీవుండిపోతే.. జీవనదిలా ఉప్పొంగిపోనా.. ఆ..ఆ..నదిలా ఉప్పొంగిపోతే.. నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ హద్దులు దాటి..మబ్బులు మీటి.. ఆడుకుందామా... ముద్దులతోనే..మిద్దెలు కట్టి ముచ్చటగుందామా... ఆహ..నీ రూపు మారింది గోపాలుడా.. లేని నాజూకు పెరిగింది నా రాముడా.. పూలఉయ్యాల ఊపాలా..ఓ బాలుడా.. బాలుడా..గోపాలుడా.. హా..ఆ బాలుడా..గోపాలుడా.. హ్హా..హ్హా..హ్హా.. ఈ రాధ కన్నేస్తే గోపాలుడే.. మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే.. వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే..