Abhimanyudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Abhimanyudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మార్చి 2024, శనివారం

Abhimanyudu : Aakesi Pappesi Song Lyrics (ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి)

చిత్రం: అభిమన్యుడు (1984)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

సంగీతం: కె.వి.మహదేవన్




పల్లవి : ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి తనకో ముద్ద.. నాకో ముద్ద ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి తనకో ముద్ద.. నాకో ముద్ద తినిపించువాడొచ్చే వేళయింది.. వళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది ఇలా.. ఇలా.. ఇలా..ఆ..ఇలా.. ఇలా.. ఇలా.. చరణం 1 : అతగడే జతగాడు అనుకున్నది.. అనుకున్నదే కలలు కంటున్నది అతగాడే జతగాడు అనుకున్నది.. అనుకున్నదే కలలు కంటున్నది కలలోని విందు... కనులవిందవునా కలలోని విందు... కనులవిందవునా మనసులోని ఆశ... మాంగళ్యమౌనా ఇలా... ఇలా... ఇలా..ఆ..ఇలా... ఇలా... ఇలా చరణం 2 : ఇది కలా... కలా... కలా... మనమిలా.. ఇలా... ఇలా  గాలిలా పువ్వులా తావిలా... కలిసి ఉన్నాము కలవకనే కలుసుకున్నాము... తెలియకనే వెలుగుకు నీడకు చెలిమిలా... ఒక్కటైనాము కలవకనే ఒదిగి ఉన్నాము... కరగకనే  ఈ ప్రేమపత్రము..ఈ జన్మకు చెల్లువేయ్యుము ప్రతి జన్మజన్మకు..మరల తిరగ వ్రాసుకొందము  ఎలా ఎలా ఎలా..ఆ ఆ ఆ ఇలా ఇలా ఇలా..ఇలా ఇలా ఇలా  ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది..ఆశ ఉంది  చరణం 3 : వెన్నెల కలువలా చెలువలా మందగించాము... జతలుగ విందులవుదాము... కథలుగా కన్నుల పాపలా... చూపులా.. చూచుకుందాము... సొగసులుగా పగలు రేయిగా... రేయి పగలుగా ఈ రాగసూత్రము... మూడుముళ్ళు వేసుకుందము ఈ మూగమంత్రము... దీవెనగా చేసుకుందము ఎలా ఎలా ఎలా..ఆ... ఆ... ఆ... ఇలా.. ఇలా.. ఇలా..ఇలా... ఇలా... ఇలా ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది..ఆశ ఉంది మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్....  మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

Abhimanyudu : Oke Godugu Oke Adugu Song Lyrics (ఒకే గొడుగు)

చిత్రం: అభిమన్యుడు (1984)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

సంగీతం: కె.వి.మహదేవన్



పల్లవి:

ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా ఒకరికొకరుగా.. ఒకే ఒకరుగా కలిసి పయనించే స్నేహము.. వలపు వర్షించే మేఘము ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా ఒకరికొకరుగా.. ఒకే ఒకరుగా కలిసి పయనించే స్నేహము.. వలపు వర్షించే మేఘము ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా ఒకరికొకరుగా.. ఆ... ఆ.. ఆ.. ఒకే ఒకరుగా... ఆ... ఆ.. ఆ.. చరణం: 1

నీలి మబ్బు మెరిసి మెరిసి.. నీళ్ళ మనసు మురిసి మురిసి ఎన్ని జలదరింపులో.. ఎన్నెన్ని పులకరింతలో చినుకు చినుకు కలిసి కలిసి.. చెలిమి జల్లు కురిసి కురిసి ఎన్ని వలపు వరదలో.. ఎన్నెన్ని కలల వాగులో ఇది భూదేవికి సీమంతం.. అనురాగానికి వసంతం ఇది భూదేవికి సీమంతం.. అనురాగానికి వసంతం ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా ఒకరికొకరుగా.. ఆ... ఆ.. ఆ.. ఒకే ఒకరుగా... ఆ... ఆ.. ఆ.. చరణం: 2

కన్నె తీగ తడిసి తడిసి.. వన్నె మొగ్గ తొడిగి తొడిగి ఎన్ని పూలపొంగులో.. ఎన్నెన్ని రంగవల్లులో ఇంద్రధనస్సు పందిరేసి.. రంగులేడు ముగ్గులేసి ఎన్ని మధనపూజలో.. ఎన్నెన్ని మరులవిందులో ఇది ఈ సృష్టికి ఆనందం... ఇది మన ఇద్దరి అనుబంధం ఇది ఈ సృష్టికి ఆనందం... ఇది మన ఇద్దరి అనుబంధం ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా ఒకరికొకరుగా.. ఒకే ఒకరుగా కలిసి పయనించే స్నేహము.. వలపు వర్షించే మేఘము ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా ఒకరికొకరుగా.. ఆ... ఆ.. ఆ.. ఒకే ఒకరుగా... ఆ... ఆ.. ఆ..

Abhimanyudu : Suryudu Chustunnadu Song lyrics (సూర్యుడు చూస్తున్నాడు)

చిత్రం: అభిమన్యుడు (1984)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

సంగీతం: కె.వి.మహదేవన్


పల్లవి:

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు... నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు.. సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు... నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు.. వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ... సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు... నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు.. వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ... చరణం: 1 నిన్ను ఎలా నమ్మను? ఎలా నమ్మించను..? ఆ.. ఆ..ప్రేమకు పునాది నమ్మకము.. అది నదీ ..సాగర సంగమము... ఆ ఆ.. కడలికి ఎన్నో నదుల బంధము మనిషికి ఒకటే హృదయము... ది వెలిగించని ప్రమిదలాంటిది...ఈ..ఈ.. వలచినప్పుడే....వెలిగేది... వెలిగిందా.. మరి? వలచావా.. మరి.. వెలిగిందా.. మరి? వలచావా.. మరి.. యెదలో ఏదో మెదిలింది.. అది ప్రేమని నేడే తెలిసింది... సూర్యుడు చూస్తున్నాడు.. చంద్రుడు వింటున్నాడు... సూర్యుడు చూస్తున్నాడు.. చంద్రుడు వింటున్నాడు... నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు.. వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ... చరణం: 2 ఏయ్.. వింటున్నావా?.. ఊ.. ఏమని వినమంటావ్? ఆ..ఆ.. మనసుకు భాషే లేదన్నావు.. మరి ఎవరి మాటలని వినమంటావు? ఆ..ఆ..మనసు మూగగా వినపడుతోంది? అది విన్నవాళ్ళకే భాషవుతుంది ... అది పలికించని వీణ వంటిది... మీటి నప్పుడే.. పాటవుతుంది... మిటేదెవరని... పాడేదేమని... మిటేదెవరని... పాడేదేమని... మాటా..మనసు ఒక్కటని.. అది మాయని చెరగని సత్యమని... సూర్యుడు చూస్తున్నాడు.. చంద్రుడు వింటున్నాడు... నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు.. వాడు నా వాడూ...నేడు... రేపు... ఏనాడూ...