చిత్రం: అభిషేకం (1998)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఉన్నికృష్ణన్, సునీత
సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి
పల్లవి:
నాలో నిను చూసుకోగ ,నాతో మురిపించుకోగ,
ఒల్లో పాపాయివయినావమ్మా.......
నిత్యం కాపాడుతున్నా నీలా నే పెంచగలనా
ఇంకా పసివాడినేగా అమ్మా.....
రామరక్ష అని లాల పొసినా, శ్యామలాలి అని లాలి పాడినా...
బువ్వ పెట్టినా బుజ్జగించినా ,చేయి పట్టుకొని నడక నేర్పినా...
అమ్మను మించిన అమ్మను నేకాగలనా... ............
నాలో నిను చూసుకోగ ,నాతో మురిపించుకోగ,
ఒల్లో పాపాయివయినావమ్మా.......
చరణం:1
నువ్వు మేలుకొని ఉంటె నాకు అది పట్టపగలు వేళా
ఆదమరిచి నువు నిద్దరోతే అది అర్ధరాత్రి వేళా....
నిన్ను మించి వేరే నా లోకమంటు లేదే...
అలిగిన సమయాన్నే నడి వేసవి అనుకోనా...
కిలకిల నవ్వులనే చిరుజల్లులు అనుకోనా....
చేసిన సేవలు నువు నేర్పినవే అమ్మా.................
నాలో నిను చూసుకోగ ,నాతో మురిపించుకోగ,
ఒల్లో పాపాయివయినావమ్మా.......
చరణం:2
అమ్మ లాలనా ఎంత పోందినా అంతనేది ఉందా.
వేయి జన్మలాయువిచ్చినా చాలనిపిస్తూందా.
అమ్మ లేని బ్రహ్మా చేసేది మట్టిబొమ్మా..
మనిషిగ మళిచేదీ కని పెంచు తల్లి మహిమా
మనసున నిలిచేదీ ఆ మాత్రుమూర్తి ప్రతిమా
దేవుడు సైతము కోరిన దీవేన అమ్మా...................
నాలో నిను చూసుకోగ ,నాతో మురిపించుకోగ,
ఒల్లో పాపాయివయినావమ్మా.......
చరణం:3
పాడే ఈ పాట పేరు సాగే నా బాట పేరు ఆగే ప్రతి చోటు పేరూ అమ్మా... ఎదలో నాదాల పేరు కదిలే పాదాల పేరు ఇదిగిన ఎన్నేల్ల్ల పేరు అమ్మా... అన్నమయ్య గీతాల భావన త్యాగరాజు రాగాల సాధన ఎన్ని పేర్ల దేవుల్ని కొల్చినా తల్లి వేరుల వాటి చాటునా ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మా.... పాడే ఈ పాట పేరు సాగే నా బాట పేరు ఆగే ప్రతి చోటు పేరూ అమ్మా... ఎదలో నాదాల పేరు కదిలే పాదాల పేరు ఇదిగిన ఎన్నేల్ల్ల పేరు అమ్మా... .................. నాలో నిను చూసుకోగ ,నాతో మురిపించుకోగ, ఒల్లో పాపాయివయినావమ్మా......