Acharya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Acharya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, డిసెంబర్ 2024, సోమవారం

Acharya : Laahe laahe song lyrics (లాహే లాహే )

చిత్రం: ఆచార్య (2022)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: హారిక నారాయణ, సాహితీ చాగంటి

సంగీతం: మణిశర్మ

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

కొండలరాజు బంగరుకొండా కొండజాతికి అండా దండా, 

మధ్యరాతిరిలేసి మంగళగౌరి మల్లెలు కోసిందే 

ఆటిని మాలలుకడతా మంచుకొండల సామిని తలిసిందే 

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

మెళ్ళో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగిరిపడంగా 

వొంటి ఇబూది జలజల రాలిపడంగ సాంబడు కదిలిండే 

అమ్మా పిలుపుకి సామి అత్తరుసెగలై విలవిల నలిగిండే

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

కొర కొర కొరువులు మండే కళ్ళు, జడలిరబోసిన సింపిరి కురులూ 

ఎర్రటి కోపాలెగసిన కుంకంబొట్టు యెన్నెలకాసిందే 

పెనిమిటి రాకనుతెలిసి శీమాతంగి సిగ్గులుపూసిందే  

వుబలాటంగా ముందటికురికీ అయ్యవతారం చూసిన కలికి 

ఏందా శంఖంశూలం బైరాగేసం ఏందని సణిగిందే 

ఇంపుగ ఈపూటైన రాలేవా అని సనువుగ కసిరిందే 

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

లోకాలేలే ఎంతోడైనా లోకువమడిసే సొంతింట్లోనా 

అమ్మోరి గెడ్డంపట్టీ బతిమాలినవి అడ్డాలనామాలు 

ఆలు మగల నడుమన అడ్డం రావులె ఇట్టంటి నీమాలు 

ఒకటోజామున కలిగిన విరహం, రెండొ జాముకి ముదిరిన విరసం 

సర్దుకుపోయే సరసం కుదిరే యేళకి మూడో జామాయే 

ఒద్దిక పెరిగే నాలుగో జాముకి గుళ్ళో గంటలు మొదలాయే

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

ప్రతిఒక రోజిది జరిగే ఘట్టం, ఎడమొఖమయ్యీ ఎకం అవడం 

అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం 

స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం