Alludochadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Alludochadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2025, సోమవారం

Alludochadu : Letha Kobbari Neellale Song Lyrics (లేత కొబ్బరి నీళ్లల్లే...)

చిత్రం : అల్లుడొచ్చాడు (1976)

సంగీతం : టి. చలపతిరావు

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :
లేత కొబ్బరి నీళ్లల్లే... పూత మామిడి పిందల్లే..
లేత కొబ్బరి నీళ్లల్లే ..పూత మామిడి పిందల్లే..
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు..
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు.. మనసు...
చరణం 1 : పోంగువస్తుంది నీ బాల అంగాలకు .. ఏహే...
రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు... కోక కడతావు మొలకెత్తు అందాలకు.. ఏహే...
కొంగు చాటేసి గుట్టు అంతా దాచేందుకు...
దాగలేనివి.. ఆగలేనివి... దారులేవో వెతుకుతుంటవి... లేత కొబ్బరి నీళ్లల్లే ..పూత మామిడి పిందల్లే..
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు..
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు.. మనసు...
చరణం 2 :
కోటి అర్ధాలు చూసేవు నా మాటలో..ఓ...
కోర్కెలేవేవో రేగేను నీ గుండెలో...
నేర్చుకుంటాయి నీ కళ్ళు దొంగాటలు..
ఆడుకుంటాయి నాతోటి దోబూచులు.. చూచుకోమ్మని.. దోచుకోమ్మని...
చూచుకోమ్మని దోచుకోమ్మని... దాచుకున్నవి పిలుస్తుంటవి... లేత కొబ్బరి నీళ్లల్లే ..పూత మామిడి పిందల్లే..
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు..
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు... మనసు... చరణం 3 : ఓ...వయసు తెస్తుంది ఎన్నెన్నో పేచిలను..ఏహే...
మనసు తానోల్లనంటుంది రాజీలను... ఆహా...పగలు సెగపెట్టి పెడుతుంది లోలోపల
రాత్రి ఎగదోస్తు ఉంటుంది తెల్లారులు...
రేపు ఉందని తీపి ఉందని.. ఆశలన్ని మేలుకుంటవి... లేత కొబ్బరి నీళ్లల్లే .. పూత మామిడి పిందల్లే..
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు..
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు... మనసు...

Alludochadu : Anthe Naaku Chaalu Song Lyrics (అంతే నాకు చాలు)

చిత్రం : అల్లుడొచ్చాడు (1976)

సంగీతం : టి. చలపతిరావు

గీత రచయిత : దాశరథి

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి : 

అంతే నాకు చాలు.. తమలపాకు తోడిమే పదివేలు . .
నేనేదింక కోరేదిక లేదు
అందరివోలే అడిగేదాన్ని కాను..
కొ౦దరి వోలే కొసరేదాన్ని కాను

ఓ మావ.. మావ.. మావ.. మావ.. మావ
ఓహొ బంగారు మావా.. ఓహొ బంగారు మావా
ఓహొ బంగారు మావా.. ఓహొ బంగారు మావా 

చరణం 1 :

ముక్కూకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినాది..  మావా.. మావా
ముక్కూకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినాది 
ముద్దుటు౦గరం కుదువాబెట్టీ.. ముద్దుటు౦గరం కుదువాబెట్టీ
ముక్కుకు చక్కని ముక్కెర తేరా.. మావా..  మావా
అంతే నాకు చాలు.. తమలపాకు తోడిమే పదివేలు 

చరణం 2 :

నడుమా వడ్డాణ౦ లేక నడుమూ చిన్నబోయినాది.. మావా..  మావా.. మావా.. మావా
నడుమా వడ్డాణ౦ లేక నడుమూ చిన్నబోయినాది.. నడుమూ చిన్నబోయినాది  
నాణ్యమైన దాన్యం అమ్మీ.. నడుముకు వడ్డాణ౦ తేరా
నాణ్యమైన దాన్యం అమ్మీ.. నడుముకు వడ్డాణ౦ తేరా. .  మావా
అంతే నాకు చాలు.. తమలపాకు తోడిమే పదివేలు . . నేనేదింక కోరేదిక లేదు
అందరివోలే అడిగేదాన్ని కాను.. కొ౦దరి వోలే కొసరేదాన్ని కాను

ఓ మావ.. మావ.. మావ.. మావ.. మావ
ఓహొ బంగారు మావా.. ఓహొ బంగారు మావా
ఓహొ బంగారు మావా.. ఓహొ బంగారు మావా 


చరణం 3 :

కాళ్లాకు కడియాలు లేక.. కాళ్ళు చిన్నబోయినాయి.. మావా.. మావా
కాళ్లాకు కడియాలు లేక.. కాళ్ళు చిన్నబోయినాయి
కాడి ఎద్దుల నమ్ముకోని..
కాడి ఎద్దుల నమ్ముకోని.. కాళ్లాకు కడియాలు తేరా..  మావా
అంతే నాకు చాలు.. తమలపాకు తోడిమే పదివేలు 

చరణం 4 :

పట్టెమంచం పరుపు లేక.. మనసూ చిన్నబోయినాది
మావా..  మావా.. మావా.. మావా
పట్టెమంచం పరుపు లేక.. మనసూ చిన్నబోయినాది.. మనసూ చిన్నబోయినాది
పంట భూములమ్ముకోని.. పట్టెమంచం పరుపూ తేరా
పంట భూములమ్ముకోని.. పట్టెమంచం పరుపూ తేరా.. మావా

అంతే నాకు చాలు.. తమలపాకు తోడిమే పదివేలు . . నేనేదింక కోరేదిక లేదు
అందరివోలే అడిగేదాన్ని కాను.. కొ౦దరి వోలే కొసరేదాన్ని కాను

ఓ మావ.. మావ.. మావ.. మావ.. మావ
ఓహొ బంగారు మావా.. ఓహొ బంగారు మావా
ఓహొ బంగారు మావా.. ఓహొ బంగారు మావా 

Alludochadu : Ela Cheppedhela Song Lyrics (ఎలా చెప్పేదెలా చెప్పేది..)

చిత్రం : అల్లుడొచ్చాడు (1976)

సంగీతం : టి. చలపతిరావు

గీత రచయిత : కొసరాజు

నేపధ్య గానం : పి. సుశీల



పల్లవి : 

ఎలా చెప్పేదెలా చెప్పేది.. చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది.. చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది 
ఎలా చెప్పేదెలా చెప్పేది.. చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది.. చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది 

చరణం 1 :

చాటు చాటుగా చెబుదామ౦టే.. మాయదారి చ౦ద్రుడున్నాడు
చల్లచల్లగా చెప్పాలంటే..  అల్లరి గాలి వింటున్నాడు
చాటు చాటుగా చెబుదామ౦టే.. మాయదారి చ౦ద్రుడున్నాడు
చల్లచల్లగా చెప్పాలంటే..  అల్లరి గాలి వింటున్నాడు

తిక్కరేగుతుంది వేడేక్కిపోతుంది.. తిక్కరేగుతుంది వేడేక్కిపోతుంది
వళ్ళు తెలియకుంది.. గుండెల్లో గుబులుంది
ఊపిరాడదయ్యో అయ్యో...  ఉక్కిరి బిక్కిరి అవుతుంది 

ఎలా చెప్పేదెలా చెప్పేది.. చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది.. చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది 

చరణం 2 :

పక పక నువ్వు నవ్వితే.. నా చెక్కిలి ఎరుపెక్కుతుంది
చిలిపిగ నువ్వు చూస్తే..  నా కళ్ళకు కైపెక్కుతుంది
పక పక నువ్వు నవ్వితే.. నా చెక్కిలి ఎరుపెక్కుతుంది
చిలిపిగ నువ్వు చూస్తే..  నా కళ్ళకు కైపెక్కుతుంది
నువ్వ౦టే పిచ్చి...  నీ మాటంటే పిచ్చి.. 
నువ్వ౦టే పిచ్చి..  నీ మాటంటే పిచ్చి
నువ్వుటేను పిచ్చి...  లేకుంటేను పిచ్చి
నీ పాటంటే...  అబ్బో అబ్బో.. మరీ మరీ పిచ్చి

ఎలా చెప్పేదెలా చెప్పేది.. చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది
చల్ మోహన రంగా.. చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది 

Alludochadu : Kodithe Puline Kottali Song Lyrics ( కొడితే పులినే కొట్టాలి )

చిత్రం : అల్లుడొచ్చాడు (1976)

సంగీతం : టి. చలపతిరావు

గీత రచయిత : కొసరాజు

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల



పల్లవి : కొడితే పులినే కొట్టాలి.. కొట్టాలి
పడితే చెలినే పట్టాలి.. పట్టాలి
కొడితే పులినే కొట్టాలి.. పడితే చెలినే పట్టాలి ఆ చెలి కౌగిలిలో.. చలిమంటలు పుట్టాలి.. గిలిగింతలు పెట్టాలి కొడితే పులినే కొట్టాలి.. కొట్టాలి
పడితే చెలినే పట్టాలి.. పట్టాలి
కొడితే పులినే కొట్టాలి.. పడితే చెలినే పట్టాలి ఆ చెలి కౌగిలికై పది జన్మలు కావాలీ.. పడిగాపులు కాయాలి చరణం 1 :
నీలాటి రేవుకాడ నీ లాంటి చిన్నది.. నీళ్ళలో రగిలే నిప్పల్లె వున్నది
చూపు చూసింది.. చురక వేసింది.. మేను కదిలింది.. మెరుపు మెరిసింది
పిల్లను కానూ పిడుగే నన్నది.. పిల్లను కానూ పిడుగే నన్నది
పడితే ఆ పిడుగునే పట్టాలి.. పట్టాలి.. పట్టాలి కొడితే పులినే కొట్టాలి.. కొట్టాలి
పడితే చెలినే పట్టాలి.. పట్టాలి
కొడితే పులినే కొట్టాలి.. పడితే చెలినే పట్టాలి చరణం 2 :
కోటప్ప కొండ మీద కోలాటమాడుతుంటే..
కోవ్వెక్కి కోడెగిత్త నాఫైకి దూకుతుంటే
గడుసైన చినవాడే తోడకొట్టి నిలిచ్చాడే..
కొమ్ములు విరిచేశాడే కోడెను తరిమేశాడే ఈల వేసి నే రమ్మ౦టే ఎటో జారిపోయాడే
ఈల వేసి నే రమ్మ౦టే ఎటో జారిపోయాడే
పడితే ఆ గడుసొణ్ణి.. పట్టాలి.. పట్టాలి కొడితే పులినే కొట్టాలి.. కొట్టాలి
పడితే చెలినే పట్టాలి.. పట్టాలి
కొడితే పులినే కొట్టాలి.. పడితే చెలినే పట్టాలి
చరణం 3 :
గోల్కొండ ఖిల్లాఫైన గొంతేత్తి పాడితే
ఆకాశం అంచులదాకా నా పాటే మోగితే.. మోగితే ఏమయి౦ది ? ఆకాశం కూలిందా పాతాళం పేలిందా?
కాకమ్మ మెచ్చిందా? కోకిలమ్మ చచ్చిందా?... కాదు కాదు కాలేజి పిల్లకూన కౌగిట్లో వాలింది.. కాలేజి పిల్లకూన కౌగిట్లో వాలింది
పడితే ఆ పిల్లికూననే.. పట్టాలి.. పట్టాలి కొడితే పులినే కొట్టాలి.. కొట్టాలి
పడితే చెలినే పట్టాలి.. పట్టాలి
కొడితే పులినే కొట్టాలి.. పడితే చెలినే పట్టాలి

Alludochadu : Vela Pala Undalamma Song Lyrics (వేళా పాళా ఉండాలమ్మా )

చిత్రం : అల్లుడొచ్చాడు (1976)

సంగీతం : టి. చలపతిరావు

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి : వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా
నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా
వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా కోరిక నీలో ఎంతవున్నా.. తీర్చే మొనగాడేదుట వున్నా
కోరిక నీలో ఎంతవున్నా.. తీర్చే మొనగాడేదుట వున్నా
వేడి ఎక్కడో పుట్టాలి.. నీ వేడుక అప్పుడు తీరాలి వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా
నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా
వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా చరణం 1 :
పొదలో దుమ్మెద రొద పెడితే.. మొగ్గకు తేనె వచ్చేనా
ఎదలో ఏదో సొద పెడితే.. ఎంకి పాటగా పలికేనా పొదలో దుమ్మెద రొద పెడితే.. మొగ్గకు తేనె వచ్చేనా
ఎదలో ఏదో సొద పెడితే.. ఎంకి పాటగా పలికేనా పెదవులూ రెండూ కలవాలి.. నీ ఎదలోని కుతి తీరాలి
వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా..
నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా చరణం 2 :
పదహారేళ్ళ ప్రాయంలోన ఫైటజారక నిలిచేనా
పదహారేళ్ళ ప్రాయంలోన ఫైటజారక నిలిచేనా ఎదిగే పొంగు ఏనాడైనా.. ఎదిగే పొంగు ఏనాడైనా.. అదిమిపట్టితే ఆగేనా
ఆగని వన్నీ రేగాలి.. అప్పుడు మన కథ సాగాలి వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా..
నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా
వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా