చిత్రం : అమరన్ (2024)
సంగీతం : జి వి ప్రకాష్ కుమార్
రచన : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా
అతడు: హే రంగులే (రంగులే) హే రంగులే (రంగులే) నీ రాకతో లోకమే రంగులై పొంగేనే ఆమె: వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందేనే అతడు: స్నేహమే మెల్లగా గీతలే దాటేనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఆమె: ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం అతడు: సమయానికి తెలిపేదెలా మనవైపు రారాదని దూరమై పొమ్మని ఆమె: చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని అతడు: పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చెలి చైత్రం జతగా ఆమె: కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా అతడు: హే రంగులే (రంగులే) హే రంగులే (రంగులే) నీ రాకతో లోకమే రంగులై పొంగేనే
ఆమె: వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందేనే అతడు: స్నేహమే మెల్లగా గీతలే దాటేనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఆమె: ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం