చిత్రం: అమ్మ చెప్పింది (2006)
రచన: ఎం. ఎం. కీరవాణి
గానం: ప్రణవి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి:
అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా ॥ 2 ॥ నూరేళ్ళు జరపాలని నువు పుట్టిన రోజుని Happy Birthday To You ॥ 2 ॥ Happy Birthday చిన్ని కన్న Happy Birthday To You అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా నూరేళ్ళు జరపాలని నువు పుట్టిన రోజుని చరణం-1:
కలతలెరుగని లోకంలో కాలమాగిపొతే వన్నె తగ్గని చంద్రుడిలా నువ్వు వెలుగుతుంటే ప్రతీ నెల ఒకే కళ నీ పాలనవ్వుతో తారలే నీకు అక్షతలై తల్లి దీవెనలు హారతులై నూరేళ్ళు జరపాలని నువు పుట్టిన రోజుని Happy Birthday To You ॥ 2 ॥ Happy Birthday చిన్ని కన్న Happy Birthday To You చరణం-2:
ఎదురు చూడని కానుకలే దాచి ఉంచేనురా మలుపు మలుపులో జీవితమే నీకు ఇచ్చేనురా నువ్వే కదా ఈ అమ్మకి ఒక పెద్ద కానుక నీకు ఏమివ్వగాలనంట నేను ఆశించడం తప్ప నూరేళ్ళు జరపాలని నువు పుట్టిన రోజుని Happy Birthday To You ॥ 2 ॥ Happy Birthday చిన్ని కన్న Happy Birthday To You