Amma Maata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Amma Maata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జనవరి 2025, శుక్రవారం

Amma Maata : Entha baga Annavu Song Lyrics (ఎంత బాగా అన్నావు..)

చిత్రం : అమ్మ మాట (1965)

సంగీతం : రమేష్ నాయుడు

గీత రచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం :  పి. సుశీల



పల్లవి:

ఎంత బాగా అన్నావు..
ఎంత బాగా అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా.. వేదంలా విలువైన మాట
ఎంత బాగా అన్నావు.. ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా.. వేదంలా విలువైన మాట
ఎంతబాగా అన్నావు..

చరణం 1:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..అ
జారని వానల జల్లులూ..ఊరికే ఉరిమే మబ్బులు
జారని వానల జల్లులూ..ఊరికే ఉరిమే మబ్బులు
ఆ మబ్బులెందుకూ..?
ఊరని తేనేల సోనలూ..ఊరికే పూచే పూవులు..
ఊరని తేనేల సోనలూ..ఊరికే పూచే పూవులు..
ఆ పూవులెందుకు..?
ఉతుత్తి మాటలు అనవచ్చా.. మాటలు చేతలు కావాలి
ఆ చేతలు పదుగురు మెచ్చాలి..
నూరేళ్ళు బతకాలీ.. నూరేళ్ళూ బతకాలీ..
ఎంత బాగా అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..వేదంలా విలువైన మాట
ఎంతబాగా అన్నావు..

చరణం 2:

ఆఆఆ ఆఆఅ మ్మ్..ఆ...ఆ..ఆ.. మ్మ్ మ్మ్ ఆ...ఆ...ఆ
అన్నమాట నిలిపావని..అపుడే ఘనుడైనావనీ
ముందే మురిసే మీ నాన్నా..ఆ ముసి ముసి నవ్వులు చూడరా...
కన్నా..ఆ..కన్నీరు కాదురా..కన్నవారి దీవెనరా...
ఏటికేడుగా..ఏడంతస్తుల మేడగా..ఏటికేడుగా..ఏడంతస్తుల మేడగా
నూరేళ్ళు బతకాలీ..నూరేళ్ళూ బతకాలీ..
శ్రీరామ రక్షా...శ్రీరామరక్షా...
ఎంత బాగా అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..వేదంలా విలువైన మాట
ఎంత బాగా అన్నావు..


Amma Maata : Eppudu mee paatalante Song Lyrics (ఎప్పుడూ మీ పాఠాలంటే.. )

చిత్రం : అమ్మ మాట (1965)

సంగీతం : రమేష్ నాయుడు

గీత రచయిత :  సి.నారాయణ రెడ్డి

నేపధ్య గానం :  పి. సుశీల



పల్లవి:

సర్..సర్..సార్..
ఎప్పుడూ మీ పాఠాలంటే.. ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను.. హియర్ మీ డియర్ సార్

చరణం 1:

ఒకటీ ఒకటీ కలిపితే రెండు..అది గణితం
మనసూ మనసూ కూడితే..ఒకటే... ఇది జీవితం
గిరిగీసుకొని ఉండాలంటాయిగ్రంథాలు..
గిరిగీసుకొని ఉండాలంటాయి గ్రంథాలు..
పురివిప్పుకొని ఎగరాలంటాయి అందాలు...
ఎప్పుడూ మీ పాఠాలంటే.. ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను.. హియర్ మీ డియర్ సార్

చరణం 2:

కళ్ళల్లో చూడండీ.. కనిపించును నీలాలు
పెదవుల్లో చూడండీ.. అగుపించును పగడాలు
దోసిలినిండా దొరుకుతాయి.. దోరనవ్వుల ముత్యాలు
కన్నెమేనిలో.. ఉన్నాయి..
కన్నెమేనిలో.. ఉన్నాయి
ఏ గనిలో దొరకని రతనాలు..మ్మ్..
ఎప్పుడూ మీ పాఠాలంటే..ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను..హియర్ మీ డియర్ సార్

చరణం 3:

రాధా మాధవ రాగజీవనం.. ఒక బంధం
కలువా జాబిలి వింతకలయికే.. అనుబంధం
యుగయుగాలకూ మిగిలేదొకటే.. అనురాగం
యుగయుగాలకూ మిగిలేదొకటే.. అనురాగం
చెలి మనసెరిగిన చినవానిదేలే.. ఆనందం
ఎప్పుడూ మీ పాఠాలంటే..ఎలాగండి సార్
ఈ రోజు నే చెపుతాను..హియర్ మీ డియర్ సార్

Amma Maata : Evaraina Choosara Song Lyrics (ఎవరైనా చూశారా... )

చిత్రం: అమ్మ మాట (1965)

సాహిత్యం: దేవులపల్లి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: రమేష్ నాయుడు



పల్లవి:

హవ్వా...
ఎవరైనా చూశారా... ఏమనుకుంటారు..ఊ..ఊ..
ఎవరైనా చూశారా... ఏమనుకుంటారు..ఊ..ఊ..
కొత్త మురిపెం పొద్దెరగదని... చెప్పుకోంటారు ..ఆపై తప్పుకుంటారు
ఎవరైనా చూశారా .... ఏమనుకుంటారు

చరణం 1:

ఇటు పువ్వు చూస్తుంది... అటు గువ్వ చూస్తుంది..ఉహు..
గుబురు గుబురుగా.... గుండె గుబులుగా..ఊహూ..
ఇటు పువ్వు చూస్తుంది... అటు గువ్వ చూస్తుంది..
గుబురు గుబురుగా.... గుండె గుబులుగా..
గురివింద పొద చూస్తుంది... గురివింద పొద చూస్తుందీ
పువ్వులాగ నవ్వుకోని... గువ్వలాగ రివ్వుమని
పువ్వులాగ నవ్వుకోని... గువ్వలాగ రివ్వుమని
ఇరువురిని ఆ పొదరిల్లు... పరవశించి పోమ్మందీ
అమ్మమ్మ...ఎవరైనా చూశారా...ఏమనుకుంటారు

చరణం 2:

అటు పొద్దు వాలుతుంది... మన ముద్దు తీరకుంది..ఉహు..
అటు పొద్దు వాలుతుంది... మన ముద్దు తీరకుంది..
కోయని పిలిచే కోరిక లెరిగి... నన్నందుకోని పోరాదా..ఊహూ...
..నన్నందుకోని పోరాదా
నీ నడుమున చేయివేసి... నిలువెల్లా పెనవేసి
నీ నడుమున చేయివేసి... నిలువెల్లా పెనవేసి
నీలాల మబ్బుల్లోకి ... నిన్నెత్తుకు పోతానే..హోయ్యా
ఎవరైనా చూశారా...ఏమనుకుంటారు
కొత్త మురిపెం పొద్దెరుగదని...చెప్పుకుంటారు ...ఆపై తప్పుకుంటారు

Amma Maata : Saddumanaga neeyanovoy Song Lyrics (హూష్ష్...సద్దుమణగ నీయవోయ్..)

చిత్రం: అమ్మ మాట (1965)

సాహిత్యం: దేవులపల్లి

గానం: ఎస్.జానకి

సంగీతం: రమేష్ నాయుడు



పల్లవి:

హూష్ష్...సద్దుమణగ నీయవోయ్..చందురూడా
ముద్దుతీరుతుందిలే.. అందగాడా
కుదిరింది ఇద్దరికీ భలే జత..
ముందుంది చూడవోయ్ అసలు కథ
సద్దుమణగ నీయవోయ్..చందురూడా
ముద్దుతీరు తుందిలే..అందగాడా
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలుకథ
సద్దుమణగ నీయవోయ్..చందురూడా

చరణం 1:

మల్లెపూలు మరికాస్త విచ్చుకోనీ
మామగారు మరికాస్త.. పుచ్చుకోనీ
మల్లెపూలు మరికాస్త విచ్చుకోనీ
మామగారు మరికాస్త.. పుచ్చుకోనీ
మల్లెపూలు ... విచ్చుకోనీ.. మామగారు...పుచ్చుకోనీ
అందాక ఆగితే.. మరో ఘడియ దాటితే
అనుకొన్నది చేద్దాము.. అంతు చూసుకోందాము..
సద్దుమణగ నీయవోయ్..చందురూడా
ముద్దుతీరు తుందిలే..అందగాడా
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలు కథ...
సద్దుమణగ నీయవోయ్..చందురూడా

చరణం 2:

పుట్టినిల్లు విడిచి.. ఈ పుట్ట చేరుకొంటి
పుట్టినిల్లు విడిచి.. ఈ పుట్ట చేరుకొంటి
పుట్టడాశతో.. నిన్నే చేపట్టాలనుకొంటి
పుట్టడాశతో.. నిన్నే చేపట్టాలనుకొంటి
పట్టుచిక్కువరకూ..ఫలం దక్కువరకూ
పట్టుచిక్కువరకూ..ఫలం దక్కువరకూ
ఓ పట్టాన....వదలననీ..ఒట్టేసుకోంటి...
హూష్ష్... సద్దుమణగ నీయవోయ్..చందురూడా
ముద్దుతీరు తుందిలే..అందగాడా
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలు కథ...
సద్దుమణగ నీయవోయ్..చందురూడా...

23, ఫిబ్రవరి 2022, బుధవారం

Amma Maata : Mayadari Chinnodu Song Lyrics (మాయదారి సిన్నోడు)

చిత్రం: అమ్మ మాట (1965)

సాహిత్యం: సి నారాయణ రెడ్డి

గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

సంగీతం: రమేష్ నాయుడు


పల్లవి :

మాయదారి సిన్నోడు మనసేలాగేసిండు నా మనసే లాగేసిండు.. లగ్గమెప్పుడురా.. మాఁవా .. అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా కాఁవమ్మ సెప్పవే..  రాఁవమ్మ సెప్పవే రత్తమ్మ సెప్పవే..  అత్తమ్మ సెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా చరణం 1 :

సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే.. సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే.. సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే.. సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే.. సిగరుల్లో..  సిగురుల్లో.. సిగురుల్లో.. మాటేసి కన్నుగీటిండే జివ్వున పానాలు తోడేసిండే.. ఎప్పుడ్రా మాఁవా అంటే.. సంకురాతిరి పొయ్యేదాకా.. మంచి గడియే లేదన్నాడే... ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా ఎల్లమ్మ సెప్పవే.. మల్లమ్మ సెప్పవే పుల్లమ్మ సెప్పవే.. బుల్లెమ్మ సెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా.. చరణం 2 :

ఊరి సెరువులో నే నీదులాడుతుంటే నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే ఊరి సెరువులో నేనీదులాడుతుంటే నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే... బుడుంగున...  బుడుంగున బుడుంగున మీదికి తేలిండే నా తడికొంగు పట్టుకుని లాగిండే... ఎప్పుడురా మాఁవా అంటే... శివరాతిరి ఎల్లేదాకా సుబలగ్గం లేదన్నాడే... ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా పున్నమ్మ సెప్పవే.. గున్నమ్మ సెప్పవే కన్నమ్మ సెప్పవే.. సిన్నమ్మ సెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా చరణం 3 :

కందిసేలల్లో కావలి కాసేసి సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే కందిసేలల్లో కావలి కాసేసి సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే.. గబుక్కున గుబుక్కున గబుక్కున కళ్లు రెండు మూసిండే రివ్వున వాటేసి నవ్వేసిండే ఏందిరా మాఁవా అంటే కోడికూసి కూయంగానే తాళి కడతానన్నాడే.. ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా అమ్మమ్మ సెప్పవే.. అయ్యమ్మ సెప్పవే పెద్దమ్మ సెప్పవే.. పిన్నమ్మ సెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా.. మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు కోడి కూసి కురియంగానే తాళి కడతానన్నాడే ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా..