Ammai Kapuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ammai Kapuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఆగస్టు 2021, శనివారం

Ammai Kapuram : Pelleppudu Dorukutundibabu Song Lyrics (పెళ్ళెప్పుడవుతుంది బాబూ...)

చిత్రం: అమ్మాయి కాపురం(1998 )

రచన:

గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, మంజుల, వందేమాతరం శ్రీనివాస్,వసంత్

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్


పల్లవి:

పెళ్ళెప్పుడవుతుంది బాబూ... నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2) ఏజ్ బార్ అయ్యినంక ఎవరు చేసుకుంటరండి (2) పెళ్ళెప్పుడవుతుంది బాబూ... నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2) చరణం:1

ఒంగోలు గిత్తలాగ బాబు.. వయసు రంకెలే వేస్తుంది బాబు ఆడగాలి సోకగానే ఆగమాగమయ్యిపోయి ఉరకలే యేస్తుంది బాబూ.. నా ఊపిరే తీస్తుంది బాబు అయితే ఏంజేసావ్ ?? తాళిబొట్టు పట్టుకోని ఊళ్ళమీద పడ్డనండి పెళ్ళెప్పుడవుతుంది బాబూ... నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2) చరణం:2

శ్రీకాకుళం జిల్లాకెళ్ళి బాబు.. ఓ చిన్నదాన్ని చూసినాను బాబు బుల్లి బుల్లి బుగ్గలతో మల్లెమొగ్గలాగవుంది అయితే ఏమి లాభం బాబు.. ఆ అమ్మాయికేమైంది ?? ఆమె సుట్ట బాగా పీకుతుంది బాబు.. నిప్పు నోట్ల పెట్టుకోని.. తుప్పు తుప్పునూస్తాంది పెళ్ళెప్పుడవుతుంది బాబూ... నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2) చరణం:3

గుంటూరు జిల్లాకెళ్ళి బాబు.. ముద్దుగుమ్మనే జూసినాను బాబు ముద్దబంతి పువ్వులాగ.. ముద్దుముద్దుగానుంది అయితే ఏమి లాభం బాబు.. ఈ అమ్మాయికేమైంది ?? ఆమె ఆరున్నరడుగులుంది బాబు.. ముద్దు ముచ్చటాడుకోను.. ముందు నిచ్చెనెయ్యాలండి పెళ్ళెప్పుడవుతుంది బాబూ... నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2) చరణం:4

కడప జిల్లాకెళ్ళి నేను బాబు.. కుర్ర పిల్లనే జూసినాను బాబు కందిరీగ నడుమువుంది.. కందిపప్పు ఛాయవుంది.. అయితే ఏమి లాభం బాబు.. దీనికేమివచ్చిందయ్యా ?? ఆమె భయమంటే ఎరగనంది బాబు... నాటుబాంబులెన్నో తెచ్చి.. మోటు సరసమాడమంది పెళ్ళెప్పుడవుతుంది బాబూ... నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2) చెప్పండయ్యో.. చరణం:5

కరీంనగర్ జిల్లాలోన బాబు.. కన్నెపిల్లనే చూసినాను బాబు కడిగినట్టి ముత్యమల్లే.. కళకళలాడుతోంది అయితే ఏమి లాభం బాబు.. ఏం బానేవుందిగా ?? ఆమె చేతిలోన గన్ను వుంది బాబు అన్నలతో కలిసి మనం అడివిలోకి పోదమంది పెళ్ళెప్పుడవుతుంది బాబూ... నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2) చరణం:5

హైద్రాబాద్ వెళ్ళినాను బాబు.. హై ఫ్యాషనే చూసినాను బాబు సూదంటు రాయిలాగ చూపులతో లాగుతుంటే అయితే ఏమి లాభం బాబు.. ఆమె ఉద్యోగం చేస్తవుంది బాబు ఉద్యోగమ చేసే అమ్మాయా ? చేస్కోవొచ్చుగా ?? బట్టలుతికి పెట్టగల భర్తనాకు కావాలంది ఇక పెళ్ళెప్పుడవుతుంది బాబూ... నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2) ఏజ్ బార్ అయ్యినంక ఎవరు చేసుకుంటరండి (2) ఇక పెళ్ళెప్పుడవుతుంది బాబూ... నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2)