Ammoru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ammoru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, డిసెంబర్ 2024, ఆదివారం

Ammoru : Amma Ammoru Thallo Song Lyrics (అమ్మోరు తల్లో)

చిత్రం: అమ్మోరు (1995)

రచన: మల్లెమాల

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: శ్రీ



అమ్మా..ఆఆఆఆ.. అమ్మోరు తల్లో అమ్మోరు తల్లో అమ్మా..అమ్మోరు తల్లో మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో ఆదిశక్తివి నువ్వేనంట అపరశక్తివి నువ్వేనంట ఆదిశక్తివి నువ్వేనంట అపరశక్తివి నువ్వేనంట దుష్టశక్తులను ఖతం చేసే పరాశక్తివి నువ్వేనంట అమ్మా..అమ్మోరు తల్లో అమ్మోరు తల్లో నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు నిత్యం యెలుగుతు ఉంటారంట యేదాలన్ని నీ నాలుకపై ఎపుడూ చిందులు యేస్తాయంట నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు నిత్యం యెలుగుతు ఉంటారంట యేదాలన్ని నీ నాలుకపై ఎపుడూ చిందులు యేస్తాయంట నింగి నీకు గొడుగంట నేల నీకు పీఠమంటా నిను నమ్మినవాళ్ళ నోముల పంటకు నారు నీరు నువ్వేనంట అమ్మా..అమ్మోరు తల్లో అమ్మోరు తల్లో మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో ఆఆ.. పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలమమ్మా జిత్తులమారి నక్కల మధ్య దిక్కే తోచని దీనులవమ్మా పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలము జిత్తులమారి నక్కల మధ్య దిక్కే తోచని దీనులము బ్రతుకు మాకు సుడిగుండం ప్రతిరోజు ఆకలిగండం గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా అమ్మా..అమ్మోరు తల్లో అమ్మోరు తల్లో మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో

Ammoru : Dandaalu dandaalu ammoru tallo song lyrics (శతకోటి దండాలు)

చిత్రం: అమ్మోరు (1995)

రచన: మల్లెమాల

గానం: మనో, కె.ఎస్.చిత్ర

సంగీతం: శ్రీ



అమ్మ అమ్మ అమ్మోరమ్మ

మాయమర్మం ఎరగనోళ్ళం, మట్టిపిసికి బతికెటోళ్ళం 

ఊరిదేవతైన నిన్నె, ఊపిరిగ కొలిచెటోళ్ళం 

గండవరం నెయ్యి పోసి గారెలొండి తెచ్చినాము

బుజ్జిముండ కల్లుకుండ వెంటబెట్టుకొచ్చినాము 

దండాలు దండాలు అమ్మోరు తల్లో, 

శతకోటి దండాలు మాయమ్మతల్లో 

పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో

అంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో 

ఆరగించి మమ్మేలు అమ్మోరుతల్లో 

దండాలు దండాలు అమ్మోరు తల్లో, 

శతకోటి దండాలు మాయమ్మతల్లో 


ఆదిశక్తిని నేనే.. ఆన్నపూర్ణను నేనే

ఏయ్ సకలలోకాలేలు సర్వమంగళి నేనే

బెజవాడ దుర్గమ్మ, తెలంగాణ ఎల్లమ్మ, 

నిడదోలు సత్తెమ్మ నేనే

ఏయ్ నెల్లూరు, కల్లూరు, ఆలేరు, 

సీలేరు అన్నూళ్ళ దేవతను నేనే ఆ..

మీ బాధలను తీర్చి , మీ కోర్కెలీడేర్చి  

అలరించి పాలించు అమ్మోరు నేనే ఆ..

దండాలు దండాలు అమ్మోరు తల్లో, 

శతకోటి దండాలు మాయమ్మతల్లో 

కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో 

చల్లగా ఏలుకో మాయమ్మ తల్లో