Ammoru Thalli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ammoru Thalli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, డిసెంబర్ 2024, మంగళవారం

Ammoru Thalli : Calcutta Kalive Song Lyrics (కలకత్తా కాళివే బెజవాడ దుర్గవే)

చిత్రం: అమ్మోరు తల్లి (1995)

రచన:

గానం:

సంగీతం: దేవా



కలకత్తా కాళివే బెజవాడ దుర్గవే కామాక్షి మాతవే కరుణించే తల్లివే మా ఇంటి వేల్పువే మా కల్పవల్లివే శరణంటూ నిలిచానే పదమంటి వేడానే అమ్మవని తలచానే నమ్మి నిన్ను కొలిచానే తల్లీ శాంతించు నన్నూ దీవించు సుమంగళి వరమివ్వు మాతా   చూపే రవికిరణం మోమే శశివదనం చిరునవ్వుల సిరిమువ్వల నాదం అలివేణి స్వరవీణా నీవేలే శివగామి అభిరామి నీవేనులే ఓం శక్తి ఓం కారం నీవేనులే ఈ సృష్టికాథారం నీవేనులే జగమేలు ఓ జనని జేజేలు నీకేనులే కలకత్తా కాళివే బెజవాడ దుర్గవే కామాక్షి మాతవే కరుణించే తల్లివే మా ఇంటి వేల్పువే మా కల్పవల్లివే శరణంటూ నిలిచానే పదమంటి వేడానే అమ్మవని తలచానే నమ్మి నిన్ను కొలిచానే అమ్మా ప్రళయాగ్ని కీలలతో పాపుల భరతం పట్టాలమ్మా వెన్నెలంటీ చూపులతో నీ భక్తులనే ఏలాలమ్మా జొన్నవాడా కామాక్షల్లే వ్యథలు మావి తీర్చాలమ్మా ఆ మధుర మీనాక్షల్లే సిరులు నీవు కురిపించమ్మ అరె తళతళమని మిలమిలమని నీ కన్నులు మెరవంగ ఫెళఫెళమని ఉరుములుగా నువ్వు నవ్వులు రువ్వంగ జలజలమని చినుకులుగా నీ కరుణే కురియంగా తకథిమి అని తాళన్నేవేయంగ మమ్మేలే ఓ తల్లీ అంబలినే తెచ్చామమ్మా రుచినే చూసి మెచ్చాలమ్మా భద్రకాళినై సింహమెక్కీ నేను వస్తే నీ చెంతకు భయపడీభద్రకాళినై సింహమెక్కీ నేను వస్తే నీ చెంతకు భయపడీ మూర్ఛే పోరా కలలోనైనా ఆ రూపుకు ఎవరైనా తప్పుచేస్తే తీర్చుకుంటా పగనే నేను అంబనులే కోపమొస్తే నింగినేలను ఒకటిగ చేస్తా అరె రక్తంతో స్నానమాడె రౌద్రమూర్తి నేను పచ్చరంగు ఒళ్ళు ఉన్న చాముండిని నేను ఆ కపాలాల మాల ఉన్న మహంకాళి నేను అమ్మోరుగ పోసేటీ మహమ్మారి నేను స్మశానమే నా ఇల్లురా ఈ లోకం నా ఊరురా మంచి మనసే నా కోవెలరా కలకత్తా కాళివే బెజవాడ దుర్గవే కామాక్షి మాతవే కరుణించే తల్లివే మా ఇంటి వేల్పువే మా కల్పవల్లివే శరణంటూ నిలిచానే పదమంటి వేడానే అమ్మవని తలచానే నమ్మి నిన్ను కొలిచానే

Ammoru Thalli : Sri Venkatesuniki Song Lyrics (శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా )

చిత్రం: అమ్మోరు తల్లి (1995)

రచన:

గానం:

సంగీతం: దేవా



పల్లవి :

శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా  చిట్టి చెల్లెలివమ్మా  ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ  కంచి కామాక్షివమ్మా  నీ నవ్వులో.. నీ నవ్వులో  పున్నమి వెన్నెలే విరబూయునమ్మా  తల్లి అన్నపూర్ణకు నేను అన్నంపెట్టనా  నేను కన్నతల్లిలా నీకు జోలపాడనా శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా  చిట్టి చెల్లెలివమ్మా  ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ  కంచి కామాక్షివమ్మా 

చరణం 1:

ఒడిలోన లాలించి ఓదార్చి పాలిచ్చి  నను నీవు పెంచావమ్మా  అమ్మవలె మురిపించి  ఆటలనే ఆడించి లాలినే పోశావమ్మా  తల్లీ అభిరామి బొట్టును నాకు దిద్దావే  శ్రీశైలం భ్రమరాంబ పూల జడనే వేశావే తారలనే దూసుకు తెచ్చి కమ్మలుగా ఇచ్చావే  కాంచిపురంలో నాకు చీర కొంటివే నా ఆటపాటలో నువ్వు బొమ్మవైతివే 

చరణం 2:

కాశీవిశాలాక్షి హారాలే కొని తెచ్చి  నాకోర్కె తీర్చావమ్మా  కాళహస్తి జ్ఞానాంబ బంగారు గాజులను  చేతులకే వేశావమ్మా చీకటిని కాటుకగా నీవు నాకు దిద్దావే  అందంగా ముక్కెరగా జాబిలి ముక్కని పెట్టావే  ఆ ఇంధ్రధనువును తెచ్చి వడ్డాణంగా ఉంచావే  బాల సుందరీ నీవు శక్తి రూపిణీ  నేను పాట పాడగా నీవు ఆట ఆడవా శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా  చిట్టి చెల్లెలివమ్మా  ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ  కంచి కామాక్షివమ్మా  నీ నవ్వులో.. నీ నవ్వులో  పున్నమి వెన్నెలే విరబూయునమ్మా  తల్లి అన్నపూర్ణకు నేను అన్నంపెట్టనా  నేను కన్నతల్లిలా నీకు జోలపాడనా తల్లి అన్నపూర్ణకు నేను అన్నంపెట్టనా  నేను కన్నతల్లిలా నీకు జోలపాడనా