చిత్రం: అమ్ములు (2003)
సాహిత్యం:
గానం: వందేమాతరం శ్రీనివాస్
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
పల్లవి:
పెళ్ళెప్పుడవుతుంది బాబూ... మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2) ఏజ్ బార్ అయ్యినంక ఎవరు చేసుకుంటరండి (2) పెళ్ళెప్పుడవుతుంది బాబూ... మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు చరణం:1
గుంటూరు జిల్లాకెళ్ళి బాబు.. ముద్దుగుమ్మనే జూసినాను బాబు
ముద్దబంతి పువ్వులాగ.. ముద్దుముద్దుగానవ్వే (2)
అయితే ఏమి లాభం బాబు.. (2) [గుంటూరు అమ్మాయికేమైందయ్యా చెప్పు??]
ఆమె ఆరున్నర అడుగులుంది బాబు..
అయితే ఏమి లాభం బాబు..
ఆమె ఆరున్నర అడుగులుంది బాబు..
ముద్దు ముచ్చటాడుకోను..[పెళ్ళయ్యాకండి] ముందు నిచ్చెనెయ్యాలండి
అరె..ముద్దు ముచ్చటాడుకోను.. ముందు నిచ్చెనెయ్యాలండి
పెళ్ళెప్పుడవుతుంది బాబూ... మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు
చరణం:2
కడప జిల్లాకెళ్ళి నేను బాబు.. కుర్ర పిల్లనే జూసినాను బాబు
కందిరీగ నడుమువుంది.. కందిపప్పు ఛాయగుంది..
అయితే ఏమి లాభం బాబు.. (2) [మా కడపమ్మాయికేమైందయ్యా ??]
ఆమె భయమంటే ఎరగనంది బాబు...
నాటుబాంబులెన్నో తెచ్చి.. అరె నాటుబాంబులెన్నో తెచ్చి..
మోటు సరసమాడమంది..
పెళ్ళెప్పుడవుతుంది బాబూ... మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు
చరణం:3
కరీంనగర్ జిల్లాలోన బాబు.. కన్నెపిల్లనే చూసినాను బాబు కడిగినట్టి ముత్యమల్లే.. కళకళలాడుతోంది అయితే ఏమి లాభం బాబు.. (2) [మా కరీంనగర్ పోరికేమైందిరా భయ్ ??] ఆమె చేతిలోన గన్ను వుంది బాబు.. అయితే ఏమి లాభం బాబు.. ఆమె చేతిలోన గన్ను వుంది బాబు.. అన్నలతో కలిసి మనం.. అరె అన్నలతో కలిసి మనం అడివిలోకి పోదమంది !! పెళ్ళెప్పుడవుతుంది బాబూ... మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2) చరణం:4
హైద్రాబాద్కెళ్ళి నేను బాబు.. హైక్లాసునే చూసినాను బాబు సూదంటు రాయిలాగ సూపులతో లాగుతాంది (2) అయితే ఏమి లాభం బాబు.. (2) ఆమె ఉద్యోగం చేస్తవుంది బాబు [అరె ఉద్యోగం చేసెవోళ్ళకి ఎవరైనా వంకపెడతారా భయ్.. నీయవ్వ.. నీకు పెళ్ళేకాదురా జీవితంల ] [అది కాదన్నా చిన్న కండీషన్ పెట్టిందే] [ఏమెట్టిందిరా ??] బట్టలుతికి పెట్టగల భర్తనాకు కావాలంది పెళ్ళెప్పుడవుతుంది బాబూ... మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు (2)