Anaganaga Oka Ammai లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Anaganaga Oka Ammai లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జనవరి 2024, శుక్రవారం

Anaganaga O Ammaayi : Swathi Chinuka Song Lyrics (స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా)

చిత్రం: అనగనగా ఒక అమ్మాయి (1999)

రచన:

గానం: ఉదిత్ నారాయణ్,సుజాత

సంగీతం: మణిశర్మ



పల్లవి:

స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా సాహో చందమామ తునకా రావే కౌగిలింటి దాకా చందమామ తునకా రావే కౌగిలింటి దాకా ఇంత చురకా వింత ఉరుకా ప్రేమే పుట్టాకా అబ్బో ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా చేరుకో నన్నే తారకా....ఓ..... కోలుకోలేనే కోరికా.....ఓ..... నేరుగా వచ్చేసాక మోమాటమేముంది ముద్దాడవే గోపిక స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా సాహో చందమామ తునకా రావే కౌగిలింటి దాకా చందమామ తునకా రావే కౌగిలింటి దాకా చరణం: 1 చీకటే నచ్చేసాక తొందరే పుట్టేసాక ఇష్టమైనదిస్తే యురేకా.....ఓ.... నాదనేదేదీ లేక నీదనీ అందించాక తట్టుకుంటనయ్యో తడాఖా..... కల్లోకొచ్చి కల్లోలంగా కమ్ముకుపోయాకా ఒళ్ళోకొచ్చి అల్లుకుపోతే ఆపడమెల్లాగ మరేం మారుమాటలాడకా నన్నే చేరుకోవె చిలకా మారుమాటలాడకా నిన్నే చేరుకుంది చిలకా... స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా సాహో చందమామ తునకా రావే కౌగిలింటి దాకా అబ్బో ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా చరణం: 2 ముద్దుకే ఉన్నది బుగ్గ తప్పుకో తప్పుడు సిగ్గా ఒళ్ళు దాచుకుంటే యెట్టాగా...ఓ....ఓ.... బుద్ధిగా ఉండదు పిట్ట బొత్తిగా చూడదు లెక్క మక్కుయెక్కువైతే మజాకా.... ఆహా ఓహో అనిపించిందీ అందం చూసాకా ఊహా లోకం కనిపించిందీ దగ్గరకొచ్చాక ఇదే మంచి వేళ కనక రావే మల్లెపూల కులుకా మంచి వేళ కనక రావే మల్లెపూల కులుకా స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా సాహో చందమామ తునకా రావే కౌగిలింటి దాకా ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా చేరుకో నన్నే తారకా....ఓ..... కోలుకోలేనే కోరికా.....ఓ..... నేరుగా వచ్చేసాక మోమాటమేముంది ముద్దాడవే గోపిక