Andala Rasi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Andala Rasi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఫిబ్రవరి 2025, శనివారం

Andala Rasi : Koila pilupe konaku merupu Song Lyrics (కోయిల పిలుపే కోనకు మెరుపు...)

చిత్రం: అందాల రాశి (1980)

సంగీతం: రమేష్ నాయుడు

రచన: సి.నారాయణరెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల




పల్లవి:
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...ఊ.. కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
చరణం 1:
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ.. నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ... నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ... పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పదే పదే పదే పదే ఒదిగి ఉండాలని... కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు... కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
చరణం 2:
కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ... కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ... హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
ఇలా ఇలా ఇలా ఇలా కలిసి ఉండాలనీ.... కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు... కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

Andala Rasi : Neeve Kada Naa Andala Rasi Song (నీవే కదా నా అందాలరాశి..)

చిత్రం: అందాల రాశి (1980)

సంగీతం: రమేష్ నాయుడు

రచన: ఆరుద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.పి.శైలజ



పల్లవి:
నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి.. నా జీవనాధారా లావణ్య సరసి..
నా జీవనాధారా లావణ్య సరసి..
నీ హృదయ గగనాన వెలిగే శశి..
నీ హృదయ గగనాన వెలిగే శశి.. నిను కోరి దరి జేరే నీ ప్రేయసి..
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి.. నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి.. చరణం 1 :
వేయి కనులతో వెతికేను నీ రూపమే...
వేయి కనులతో వెతికేను నీ రూపమే... కోటి గొంతులతో పలికేను నీ గీతమే..
కోటి గొంతులతో పలికేను నీ గీతమే.. కలలన్నీ కర్పూర శిలలైన చోటా..
కలలన్నీ కర్పూర శిలలైన చోటా.. కలసినది మన విడిపోని జంట... నీవే కదా నా అందాలరాశి..
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నీవే కదా నా అందాలరాశి.. చరణం 2 : ఎన్ని జన్మల చెలిమి ఎనలేని అనురాగము...
ఎన్ని జన్మల చెలిమి ఎనలేని అనురాగము... ఎన్ని నోముల కలిమి నీ ప్రణయ సౌభాగ్యము..
ఎన్ని నోముల కలిమి నీ ప్రణయ సౌభాగ్యము.. నీ వలపు నా ఇంట నెలకొన్న తులసి..
నీ వలపు నా ఇంట నెలకొన్న తులసి.. నా మనసు ప్రియ చరణాల దాసి..
నా మనసు ప్రియ చరణాల దాసి.. నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి.. నా జీవనాధారా లావణ్య సరసి..
నా జీవనాధారా లావణ్య సరసి.. నీ హృదయ గగనాన వెలిగే శశి..
నీ హృదయ గగనాన వెలిగే శశి.. నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నీవే కదా నా అందాలరాశి..





Andala Rasi : Andala Rasi Song Lyrics (అందాలరాశి... )

చిత్రం: అందాల రాశి (1980)

సంగీతం: రమేష్ నాయుడు

రచన: వేటూరి. సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.పి.శైలజ



పల్లవి :

అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి...
తరించేనులే ప్రేయశి... ప్రేయశి
అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి...
తరించేనులే ప్రేయశి... ప్రేయశి
అందాలరాశి...

చరణం 1 :

నీ రూపు హృదయాలయ దీపికా...
నీ చూపు ఉదయోదయ తారకా
నీ రూపు హృదయాలయ దీపికా...
నీ చూపు ఉదయోదయ తారకా
నీ పలుకుల సడికి ఉలికిపడే ఊర్వశినై ఊగనీ
నీ మేను తగిలి  మెలిక తిరిగి మేనకనై ఆడనీ
ఆ.. నీవే నా జీవన బృందావన రాధికా
నీవే యువతీ జన నవమోహన గీతికా
అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి...
తరించేనులే ప్రేయశి... ప్రేయశి

చరణం 2 :

నీ మాట మంత్రాక్షర మాలికా...
నీ మనసే మమతల మరుమల్లికా
నీ మాట మంత్రాక్షర మాలికా...
నీ మనసే మమతల మరుమల్లికా
పురివిప్పిన నీ సొగసున మణిపురినే చూడనీ
గురి తప్పని నీ అడుగులు కూచిపూడి ఆడనీ
నీవేలే శ్రీశైల శిఖరాంచల చంద్రికా
నీవే నా నవయవ్వన నందనవన భ్రమరికా
అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి...
తరించేనులే ప్రేయశి... ప్రేయశి
అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి...
తరించేనులే ప్రేయశి... ప్రేయశి
అందాలరాశి...


Andala Rasi : Aadinchada Vayasu Paadinchada Song Lyrics (ఆడించదా వయసు పాడించదా... )

చిత్రం: అందాల రాశి (1980)

సంగీతం: రమేష్ నాయుడు

రచన: వేటూరి. సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :

ఆడించదా వయసు పాడించదా...
చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా...
చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా

చరణం 1 :

చురుకు చురుకు ఆడపిల్ల చూపులు...
ఉరకలెయ్యి కోడెగాడి కోర్కెలు
చురుకు చురుకు ఆడపిల్ల చూపులు...
ఉరకలెయ్యి కోడెగాడి కోర్కెలు
రెండిటికి బంధమేసి ఇద్దరినీ ఒకటి చేసి
ముద్దొచ్చే పండుగలో మురిపించదా...
హాయి కురిపించదా... మేను మరపించదా

ఆడించదా వయసు పాడించదా...
చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా...
చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా 

చరణం 2 :

రమణిలోన ఉంటుందొక రాధా...
మమత ఉన్న మనిషే మాధవుడు
రమణిలోన ఉంటుందొక రాధా...
మమత ఉన్న మనిషే మాధవుడు
ఈడుజోడు కుదిరితే తోడునీడ కుదిరితే...
వేడుకగా ప్రేమగీతి పలికించదా
తనివి ఒలికించదా... బ్రతుకు పులకించదా

ఆడించదా వయసు పాడించదా...
చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా...
చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా