Ankuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ankuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2023, సోమవారం

Ankuram : Evaro Okaru Song Lyrics (ఎవరో ఒకరు ఎపుడో అపుడు )

చిత్రం: అంకురం (1993)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: హంసలేఖ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా అనుకుని కోడి కూత నిదరపోదుగా జగతికి మేలుకొల్పు మానుకోదుగా మొదటి చినుకు సూటిగా దూకిరానిదే మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే వానధార రాదుగా నేలదారికీ ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు చెదరకపోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి దానికి లెక్కలేదు కాళరాతిరీ పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ సాగలేక ఆగితే దారి తరుగునా? జాలిచూపి తీరమే దరికి చేరునా ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు