Anuraga Devatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Anuraga Devatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2022, శుక్రవారం

Anuraga Devatha : Choosuko Padhilanga Song Lyrics (చూసుకో పదిలంగా)


చిత్రం: అనురాగదేవత (1982)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సుశీల పల్లవి: ఆ..ఆ..ఆ..ఆఅ..ఆ.ఆఅ.. ఆ హో... ఆ హో... చూసుకో పదిలంగా... హృదయాన్ని అద్దంలా చూసుకో పదిలంగా... హృదయాన్ని అద్దంలా పగిలేది కాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా..ఆ..ఆ చరణం 1: వికసించే పూలు ముళ్ళు.. విధి రాతకు ఆనవాళ్ళూ వికసించే పూలోకంలో.. విధి రాతకు ఆనవాళ్ళూ ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు ఒకరి కంట పన్నీరైనా..ఆ..ఆ ఒకరి కంట కన్నీళ్ళు ఎండమావి నీరు తాగి.. గుండె మంటలార్చుకోకు ఎండమావి నీరు తాగి.. గుండె మంటలార్చుకోకు ఆశ పెంచుకోకు నేస్తం.. అది నిరాశ స్వాగత హస్తం చూసుకో పది లంగా... హృదయాన్ని అద్దంలా పగిలేది గాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా..ఆ..ఆ చరణం 2: కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి కలుసుకోనీ ఇరు తీరాలూ.. కనిపించని సుడిగుండాలు చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా పగిలేది కాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా..ఆ..ఆ