చిత్రం : అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (2024)
సంగీతం : కార్తీక్
రచన : కృష్ణ చైతన్య
గానం: కార్తీక్, నిత్యశ్రీ
పల్లవి:
హే…తార ని తెలుసుకున్నా
హే…తార ని కలుసుకున్నా
హమ్మో…తార ని తలచుకున్నా
నా కథ మొదలైందే… నీతో
హే…తార ని తెలుసుకున్నా
హే…తార ని కలుసుకున్నా
హమ్మో…తార ని తలచుకున్నా
నా కథ మొదలైందే… నీతో
అడుగులు నీతో తడబడిన
విడి విడిగా నీతో లేనా
పెదవే దాటని మాటలు వినపడవా
కంటికి నిదురే శాపం లా
తాకిన చూపులు తాపం లా
తిరిగేస్తున్నానే ముందే..
హే…తార ని తెలుసుకున్నా
హే…తార ని కలుసుకున్నా
హమ్మో…తార ని తలచుకున్నా
నా కథ మొదలైందే… నీతో
చరణం-1:
నిలబడదే నా చూపు కాసేపే నా వైపు తెలియందా మరి నీకు రెప్పపాటు చూపులో విన్నానే మాటలు వేలల్లో ఊసులు నన్నే దాటనీ నిన్నే చేరనీ చెలి గాలో చిరు గాలో ఇక ముందే తెలియాలో కౌగిలిలో నలిగేనే నా పంచ ప్రాణాలే నీ కోసం కాదంటే నేనున్నా లేనట్టే నేనున్నదే నీవల్లే.. హే…తార ని తెలుసుకోవ హే…తార ని కలుసుకోవ హమ్మో…తార ని తలచుకోవ నా కథ మదలైందే… నీతో
అడుగులు నీతో తడబడినా విడి విడిగా నీతో లేనా పెదవే దాటని మాటలు వినపడవా కంటికి నిదురే శాపం లా తాకిన చూపులు తాపం లా తిరిగేస్తున్నాలే ముందే..