Appula Apparao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Appula Apparao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మార్చి 2024, బుధవారం

Appula Apparao: Moodo Debba Song Lyrics (మూడో దెబ్బ కొట్టాక భామా)

చిత్రం: అప్పుల అప్పారావు (1992)

సాహిత్యం: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

సంగీతం:రాజన్-నాగేంద్ర



పల్లవి:

మూడో దెబ్బ కొట్టాక భామా నా ఎదలోన పొంగింది ప్రేమ ప్రతిక్షణమూ.. ఓ ఓ..ప్రతిక్షణమూ పరవళ్ళలో పిచ్చెక్కిపోవాలింక రావే ప్రేమికా !! ఆ మూడో దెబ్బ కొట్టాక మామా నా ఎద పొంగిపోయింది ప్రేమ అనుక్షణమూ.. ఓ ఓ..అనుక్షణమూ ఉరవళ్ళతో వెర్రెత్తిపోవాలింక రారా నా ప్రియా !! మూడో దెబ్బ కొట్టాక భామా నా ఎదలోన పొంగింది ప్రేమ

చరణం: 1 అమ్మడి పైట జారితే ఆశలు రేగవా అల్లరి మాని బుద్ధిగా మోజే తీర్చవా చెక్కిలి మీటి నా చెవిలో పువ్వులు పెట్టకు అక్కున చేర్చి ప్రేమతో ఖైదీ చేయకు హరిలో హరీ !! వినరా మరి !! వరాల నరాల సరాగమాడిన మూడో దెబ్బ కొట్టాక భామా నా ఎదలోన పొంగింది ప్రేమ

చరణం: 2

పడుచుదనాల గారడీ చేసేయ్ నే రెడీ లవ్వే లేని యవ్వనం కాదా ట్రాజెడీ శృంగారాల దీవిలో చిన్నెలు చూపనా సింగారాల నా చెలీ చిందే వేయనా ఏదో చలి !! ఎదలో గిలి !! తుఫాను రేపిన షిఫాను మాటున

మూడో దెబ్బ కొట్టాక భామా నా ఎదలోన పొంగింది ప్రేమ ప్రతిక్షణమూ.. ఓ ఓ..ప్రతిక్షణమూ పరవళ్ళలో పిచ్చెక్కిపోవాలింక రావే ప్రేమికా !! ఆ మూడో దెబ్బ కొట్టాక మామా నా ఎద పొంగిపోయింది ప్రేమ అనుక్షణమూ.. ఓ ఓ..అనుక్షణమూ ఉరవళ్ళతో వెర్రెత్తిపోవాలింక రారా నా ప్రియా !!

మూడో దెబ్బ కొట్టాక భామా నా ఎదలోన పొంగింది ప్రేమ