Asthulu Anthasthulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Asthulu Anthasthulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జులై 2021, శనివారం

Asthulu Anthasthulu : Midisipade Deepalivi Song Lyrics (మిడిసిపడే దీపాలివి)

చిత్రం: ఆస్తులు అంతస్తులు(1988 )

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: కె.జె.ఏసుదాసు



మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ.. సుఖ దుఖఃలే ఏకమైన రేవులో... మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు బావిలోతు ఇంతని తెలుసు.. నదుల లోతు కొంతే తెలుసు .. ఆడ గుండె లోతెంతో లోకంలో ఎవరికి తెలుసు.. ఏ నిమిషం ప్రేమిస్తుందో .. ఏ నిమిషం పగబడుతుందో.. ఎప్పుడెలా మారుతుందో.. తెలిసిన మగవాడు లేడు.. రాగం.. అనురాగం..ఎరవేసి.. జతచేరి.. కన్నీట ముంచుతుంది రా.. మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు పాము విషం శోకినవాడు.. ఆయువుంటె బ్రతికేస్తాడు.. కన్నెవలపు కరిచినవాడు..నూరేళ్ళకి తేరుకోడు.. సొగసు చూసి మనసిచ్చావా..బందీగా నిలబడతావు.. నీ తలలే విరిగిననాడూ.. తలపే నీ తోడవుతుంది.. లేదు ఏ సౌఖ్యం.. రవ్వంత సంతోషం .. ఈ ఆడదాని ప్రేమలో... మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ.. సుఖ దుఖఃలే ఏకమైన రేవులో... మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు