Ayyappa Swami లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ayyappa Swami లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2025, మంగళవారం

Ayyappa Swami : Sabarimalanu Swarna Chandrodayam Song Lyrics (శబరిమలను స్వర్ణ చంద్రోదయం)

చిత్రం: అయ్యప్ప స్వామి (1975)

సాహిత్యం:

గానం: ఏసుదాస్

సంగీతం: జి.దేవరాజన్





పల్లవి :

శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా
శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా
శబరిమలను స్వర్ణ చంద్రోదయం 

చరణం 1 :

ప్రీతియే ఉల్లమున పాలవును..
అదే చల్లని నీ ఎదను పెరుగౌను
వెన్నయే నీవిత్తు అనురాగం..
నీకు నెయ్యభిషేకమునే జరిపిస్తా
నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..
శబరిమలను స్వర్ణ చంద్రోదయం 

చరణం 2 :

పుణ్యమిత్తే పన్నీరభిషేకం..
జనులు భక్తితో చేసెడి పాలభిషేకం
దివ్య పంచామృతాన అభిషేకం..
నీదు తనువంత జ్యోతివలె వెలిగేనూ

నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..
శబరిమలను స్వర్ణ చంద్రోదయం


చరణం 3 : 

దోసిట పుణ్య జలం అందుకొని..
అదే నీ పేరు స్తుతియించి శిరసునుంచి
కరుగు విభూతితో అభిషేకం..
హరి యోమని చందనంతో అభిషేకం

నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..

శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా

అయ్యప్పా.. శరణం అయ్యప్పా
అయ్యప్పా.. శరణం అయ్యప్పా
అయ్యప్పా.. శరణం అయ్యప్పా 

Ayyappa Swami : Harivaraasanam Viswamohanam Song Lyrics (హరివరాసనం... విశ్వమోహనం)

చిత్రం: అయ్యప్ప స్వామి (1975)

సాహిత్యం:

గానం: ఏసుదాస్

సంగీతం: జి.దేవరాజన్




పల్లవి :

హరివరాసనం... విశ్వమోహనం
హరిదధీశ్వరం...  ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం...  నిత్య నర్తనం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే

శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప


చరణం 1 :

శరణ కీర్తనం...  శక్తమానసం
భరణలోలుపం...  నర్తనాలసం
అరుణభాసురం...  భూతనాయకం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే

శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప

చరణం 2 :

కళమృదుస్మితం...  సుందరాననం
కళభకోమళం...  గాత్రమోహనం
కళభకేసరి...  వాజివాహనం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే
శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప

చరణం 3 :

శ్రితజనప్రియం...  చిందితప్రదం
శృతివిభూషణం...  సాధు జీవనం
శృతిమనోహరం...  గీతలాలసం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే

శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప

Ayyappa Swami : Jagamula Netha Song Lyrics (జగముల నేతా)

చిత్రం: అయ్యప్ప స్వామి (1975)

సాహిత్యం:

గానం: ఏసుదాస్

సంగీతం: జి.దేవరాజన్





పల్లవి :

జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా

ఆ ఆ.. జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా 

చరణం 1 :

క్రూరులపైబడి కూల్తువుగాకా.. శ్రీమన్నారాయణా
ఇలను ఋషులను గాంచి దీవించరాగా.. శ్రీమన్నారాయణా
దుష్టుల శిక్షించు లోకవిజేతా..  శ్రీమన్నారాయణా
నీవు శిష్టుల రక్షించు పావనచరితా.. శ్రీమన్నారాయణా..

జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా 

చరణం 2 :

పురువిని మహిషి దుర్భర చరియలు కనలేవూ తండ్రీ
దాని దున్మగ మనిషిగ పుట్టితివయ్యా.. శ్రీమన్నారాయణా
జీవులే నీదు సృష్టి అనునది మరచితివో దేవా
ఆ దివ్య మునులను కాపాడుటకై వెడలేవో తండ్రీ.. 

జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా  

చరణం 3 : 

సృష్టి అంత నీ రక్షణ లేకా విధ్వన్సం కాదా
ఇల దుష్టుల కూర్చూ శిష్టుల బ్రోచూ జగదీశ్వర దేవా
అనంత శయనం మందున తేలుచు ఇనవో జగద్పితా..
ఘోరాపదలందున కుమిలే దీనుల కావము పరామత్మా.. 

జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా


చరణం 4 :

సకల మానవుల గళములే విజయ శంఖం పూరింతూ
హరిహరిహరి అని దిజ్వులు వేడగా పోరున విహరించు
రియతు కంపించ భూమి తలదించ విజయం సాధించూ
ఈ పలువుల క్రౌర్యం పుడమిన పాపం నేడే నశియించు
శ్రీమన్నారాయణా... శ్రీపతి జగన్నాధా...
వినవో జగద్పితా... దయగలవో పరమాత్మా..ఆ ఆ