Bala Mitrula Katha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bala Mitrula Katha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, అక్టోబర్ 2021, ఆదివారం

Bala Mitrula Katha : Gunna Mamidi Komma Meeda Song Lyrics (గున్నమామిడి కొమ్మమీద)

చిత్రం: బాల మిత్రుల కథ (1972)

రచన: సి. నారాయణ రెడ్డి

గానం : ఎస్.జానకి

సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం



గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది… ఒక గూటిలోన కోయిలుందీ గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి… ఆ ఆ..  చిలకేమో పచ్చనిది… కోయిలేమో నల్లనిది ఐనా ఒక మనసేదో… ఆ రెంటిని కలిపింది… ||2|| పొద్దున చిలకను చూడందే… ముద్దుగ ముచ్చటలాడందే పొద్దున చిలకను చూడందే… ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే… చివురులు ముట్టదు… చిన్నారి కోయిల చిలక ఊగదు… కొమ్మ ఊయలా…ఆ ఆ ఆఆ హొయ్… గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది… ఒక గూటిలోన కోయిలుందీ గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి… ఆ ఆ.. ఒక పలుకే పలుకుతాయి… ఒక జట్టుగ తిరుగుతాయి ఎండైనా వానైనా… ఏకంగా ఎగురుతాయి… ||2|| రంగూ రూపు వేరైనా… జాతి రీతి ఏదైనా రంగూ రూపు వేరైనా… తమ జాతి రీతి ఏదైనా చిలకా కోయిల చేసిన చెలిమి… ముందు తరాలకు తరగని కలిమి… ఈ ఈఈ హొయ్… గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది… ఒక గూటిలోన కోయిలుందీ గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి… గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి… ఆ ఆ ఆ