Balu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Balu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, నవంబర్ 2021, శుక్రవారం

Balu : Lokale Gelavaga Song Lyrics (లోకాలే గెలవగ నిలిచిన)

చిత్రం: బాలు (2005)

రచన: జొన్నవిత్తుల

గానం: మురళి , కె.యస్.చిత్ర

సంగీతం: మణి శర్మ



లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలఫై ఎగసిన ఈ ఆనందం ని చిరూనవ్వేగా నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువునా నీవే నీవే నీవే నీవూగా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఈ పువ్వు కోరిందిరా ప్రేమభిషేకాలని నా చూపూ పంపిందిలే... పన్నీటీ మేఘాలనే బుగ్గపై చిరు చుక్కవై జూట్టూవై సిరిబోట్టూవై నాతోనే నువ్వుండిపో ఊపిరై యద తీపినై ఊపునై కనూచూపూనై నీలోనే నేనుంటినే నీ రామచిలకను నేనై నా రామచంద్రూడూ నీవై కలీసే ఊంటే అంతే చాలురా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఈ రాధా బృందావనం సుస్వాగతం అంది రా.. నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే పక్కగా రారామాన్ని కమ్మగా ముద్దిమ్మని ఎన్నాళ్ళు కోరలిరా ఎప్పూడూ కనూరేప్పల చప్పూడై యదలోపల ఉంటూనే ఉన్నానుగా... సన్నాయీ స్వరమూల మధురిమా పూన్నగా పూవ్వూల ఘూమ ఘూమ అన్నీ నీవై నన్నే చేరరా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలఫై ఎగసిన ఈ ఆనందం ని చిరూనవ్వేగా నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువునా నీవే నీవే నీవే నీవూగా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

5, జులై 2021, సోమవారం

Balu : Neelo Jarige Song Lyrics (నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా )

చిత్రం: బాలు(2005 )

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: హరిహరన్, శ్రేయ ఘోషల్


నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనా సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా ముందు నీకే తెలిసేనా ప్రతిరోజు నడిరాతిరిలో చేస్తావా స్నానాలు ఒళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు ఉడికించే ఆలోచనలూ పుడుతున్నవి కాబోలు ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు అదిగో ఆ ఉలుకే చెబుతుంది నువు దాచాలనుకున్నా దీన్నే లవులో పడిపోటం అంటున్నా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా ఒంట్లో బాగుంటం లేదా ఈ మధ్యన నీకసలు నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లు ఐతేమరి నువ్వెపుడు కనలేదా ఈ కలలు నా కలలో ఏనాడు నువు రాలేదిన్నాళ్ళు అదిగో ఆ మాటే నీనోటే చెప్పించాలనుకున్నా దీన్నే లవులో పడిపోటం అంటున్నా ఊ అవునా ఏమో నే కాదనలేకున్నా నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా నాలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఓప్పుకోవే ఇకనైనా 

ఆసర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా ముందు నీకే తెలిసేనా