చిత్రం: బంగారు మామ (1992)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: రాజ్-కోటి
M : కన్నే చిలకమ్మా జాడేది గోరువంక కన్న కలలన్నీ పండేది ఎన్నడింక గుండె వడగాలి తో..ఓ.... కంటి వడగండ్ల తో .. ఎండమావీదుతున్నాను వేసంగి లో కన్నే చిలకమ్మా జాడేది గోరువంక కన్న కలలన్నీ పండేది ఎన్నడింక చరణం: 1
M:సాగేటి నదికి రేవేది తుదకు ఆ సాగరాలే కదా..అఅ తారల్ల నడుమ ఏముంది గనుక ఆ నీలి నింగే కదా... F:రిసిన మేఘము కురియదు లే.... కురిసిన వానకు కరుగును లే బ్రహ్మ రాతేందుకో... బొమ్మలాట గా.. నీడమాసిందిలే సందే నీరేండలో రామ చిలకమ్మ వాలింది పాడులంక కన్ను నీరింక వగచింది గోరువంక...
చరణం-2..
F:సూరీడు పుట్టి భూమాత బొట్టు గోదారి పాలే కదా ..... చుక్కాని పట్టు నా నావ గుట్టు ఏ గాలి వాటా గదా . M:మినుగురు ఆశల మిల మిల తో .. వెలగని దీపపు వేలవేల తో ఏమీ ఆపేక్షలో..ఓఓఓ.. ఎందుకీ శిక్షలొ .. పూజ కె రాని పూలైన మా జంటలు F:రామ చిలకమ్మ వాలింది పాడులంక కన్ను నీరింక వగచింది గోరువంక M:గుండె వడగాలి తో ... కంటి వడగండ్ల తో ఎండమావీదున్నాను వేసంగి లో కన్నే చిలకమ్మా జాడేది గోరువంక కన్న కలలన్నీ పండేది ఎన్నడింక కన్నే చిలకమ్మా జాడేది గోరువంక కన్న కలలన్నీ పండేది ఎన్నడింక