Bhakta Kannappa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bhakta Kannappa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మార్చి 2025, గురువారం

Bhakta Kannappa : Takita Takita Song Lyrics (తకిటతకతకిట)

చిత్రం : భక్త కన్నప్ప (1976)

సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం

గానం : రామ కృష్ణ, పి.సుశీల

సాహిత్యం: ఆరుద్ర



తకిటతకతకిట తకిట పదయుగళ
వికటశంభో ఝళిత మధుర పదయుగళా
హరిహరాంకిత పదా

జయ జయ మహాదేవ శివ శంకరా..
హర హర మహాదేవ అభయంకరా..

అని దేవతలు శివుని కొనియాడా
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా
కంపించెనింతలో కైలాసమావేళా
కనిపించెనంత అకాల ప్రళయ జ్వాలా

జగములేలినవాని సగము నివ్వెరబోయే
సగము మిగిలిన వాని మొగము నగవైపోయే

ఓం నమః శివాయ !
ఓం నమః శివాయ !!

అతడే అతడే అర్జునుడూ
పాండవ విజయ యశోధనుడూ

అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి యుంద గిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు..ఇది సౄష్థించెను దివ్య మహత్తూ !

నెలవంక తలపాగ నెమలి ఈకగ మారి
తలపైన గంగమ్మ తలపులోనికి మారి
నిప్పులున్సే కన్ను నిదురోయి బొట్టాయె
భూగి పూతకు మారు పులి తోలు వలువాయె
ఎరుక గల్గిన శివుడు ఎరుక గా మారగా
తల్లి పార్వతి మారె తాను ఎకుకత గా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడీ కదలి వచ్చెను శివుడూ
కైలాసమును వీడీ కదలి వచ్చెను శివుడూ

శివుడు ఆనతిని శిరమున దాల్చి నూకాసురుడను రాక్షసుడూ
వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిరిపోవగా

చిచ్చర పిడుగై వచ్చిన పందిని
రెచ్చిన కోపముతో అర్జునుడూ మట్టుపెట్టగా
పట్టె బాణమూ ధనువొక చేతను అందుకొనీ
చూసిన కంటను చూడకనే గురి చూసిననంతనే..వేసినంతనే..

తలలు రెండుగా విలవిలలాడుతు
తనువు కొండగా గిర గిర తిరుగుచు
అటునిటు తగిలిన రెండు బాణముల
అసువులు వీడెను వరాహమూ...

కొట్టితి నేనని అర్జునుడూ
పడగొట్టితి నేనని శివుడూ
పట్టిన పట్టును వదలకనే తొడగొట్టిన వీరముతో హపుడూ

వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది
భేటి తగవు పొమ్మనె విలు మీటి పలికె శివుడూ

చేవ నాది చేత నాది చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మనె కనుసైగ చేసె అర్జునుడూ

గాండీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించె అర్జునుడు
కానీ అపుడతడు దేహి చేతుల కార్తవీర్యార్జునుడూ

ఓంకార ఘనధనుష్టంకారముల తోడ శరపరంపర కురిసె హరుడు
అయినా నరుని కాతడు మనోహరుడూ

చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయే
విధివిలాసమేమో పెట్టిన గురి వట్టిదాయే
అస్త్రములే విఫలమాయె..శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడిఎడమై సంధించుట మరచిపోయే

జగతికి సుగతిని సాధించిన తల
దింగంతాలకవతల మెలిగే తల
గంగకు నెలవై..కళకాదరువై
హరిబ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై అగధ నేత్రమై
శ్రీపరమై శుభమైన శివుని తల
అదరగా..సౄష్టి చెదరగా

తాడి ఎత్తు గాండీవముతో..ముత్తాడి ఎద్దుగా ఎదిగి అర్జునుడు
చండ కోపమున కొట్టినంతనే

తల్లితండ్రుల కనుల చలువైన దేవుడూ
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడూ
ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడూ
పదములంటెను నరుడు భక్తితో అపుడూ

కరచరణ శ్రుతం వా
కర్మ వాక్కాయజం వా..
శ్రవణ నయనజం వా
మానసవాపరధాం
విహిత మహితం వా..
సర్వామేతక్షమస్వా..
శివ శివ కరుణాబ్దే..శ్రీ మహాదేవ శంభో..
నమస్తే..నమస్తే..నమస్తే..నమః..


19, మార్చి 2025, బుధవారం

Bhakta Kannappa : Siva Siva Sankara Song Lyrics (శివ శివ శంకర)

చిత్రం. : భక్త కన్నప్ప (1976)

సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం

గానం : రామ కృష్ణ, పి.సుశీల

సాహిత్యం: ఆరుద్ర



పల్లవి:

శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో
శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో

చరణం1:

పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు
శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో

చరణం2:

మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకూ

26, ఫిబ్రవరి 2022, శనివారం

Bhakta Kannappa : Enni Elo Enni Elo Song Lyrics (ఎన్నీయల్లో..ఎన్నీయల్లో.)

చిత్రం. : భక్త కన్నప్ప (1976)

సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం

గానం : రామ కృష్ణ, పి.సుశీల

సాహిత్యం: ఆరుద్ర


పల్లవి: హోయ్.... హోయ్.. ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్ సిన్నాదాని మనువు సేయి సందామా.. ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్ సిన్నాదాని మనువు సేయి సందామా.. అరె చిన్నోడా !! ఆకు చాటున పిందె వుంది.. చెట్టు చాటున చిన్నాదుంది..ఓ..ఓ.. ఆకు చాటున పిందె వుంది.. చెట్టు చాటున చిన్నాదుంది చక్కని చుక్కని టక్కున ఎతికి దక్కించుకోరా..దక్కించుకోరా.. దక్కించుకోరా... దక్కించుకోరా.!! !!ఎన్నీయల్లో!! అరె సిన్నమ్మీ!! మబ్బు ఎనక మెరుపుతీగె... దుబ్బు ఎనకా మల్లెతీగె..ఓ..ఓ మబ్బు ఎనక మెరుపుతీగె... దుబ్బు ఎనకా మల్లెతీగె ఏడనున్నా దాగోలేవే మల్లెమొగ్గా.. అబ్బో సిగ్గా.. మల్లెమొగ్గా.. అబ్బో సిగ్గా!! !!ఎన్నీయల్లో!! చరణం 1: ఆహ అత్తారింటికి దారేదమ్మ సందామామా ?? ఆమడ దూరం వుందోలమ్మా సందామామా.. ఆహ అత్తారింటికి దారేదమ్మ సందామామా ?? అరెరెరే...ఆమడ దూరం వుందోలమ్మా సందామామా ఆమడ దూరం వున్నాగాని ఎళ్ళాలమ్మా.. ఆమడ దూరం వున్నాగాని ఎళ్ళాలమ్మా..హుయ్ !!ఎన్నీయల్లో!! హోయ్..హోయ్.. సీకటింట్లో చిక్కు తీసా.. వెలుతురింట్లో కొప్పు ముడిసా.. ఓ..ఓ..ఓ..సీకటింట్లో చిక్కు తీసా.. వెలుతురింట్లో కొప్పు ముడిసా కొప్పులోనా మల్లెపువ్వు గుప్పుమందే..ఒప్పులకుప్పా.. ఓయ్..గుప్పుమందే..ఒప్పులకుప్పా !! !!ఎన్నీయల్లో!! చరణం 2: చందమామా రేఖలెన్ని ?? కలువపూవు రేకులెన్ని ?? ఓ..ఓ..ఓ.. చందమామ రేఖలెన్ని ?? కలువపూవు రేకులెన్ని ?? దానికి దీనికి ఎన్నెన్ని వున్నా.. నీకు నేనే..నాకు నువ్వే.. నీకు నేనే నాకు నువ్వే ! ఆ..ఆ..ఆ.. !!ఎన్నీయల్లో!!

23, ఫిబ్రవరి 2022, బుధవారం

Bhakta Kannappa : Aakasam Dinchala Song Lyrics (ఆకాశం దించాలా)

చిత్రం. : భక్త కన్నప్ప (1976)

సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం

గానం : రామ కృష్ణ, పి.సుశీల

సాహిత్యం: ఆరుద్ర



ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు సాలు ఆకాశం నా నడుము నెలవెంక నా నుదురు సిగలో నువ్వేరా పట్టుతేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే ! తెస్తానే !! మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే ! తీస్తానే !! ఆ... పట్టుతేనె నీకన్నా తీయ్యంగా ఉంటుందా మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా అంతేనా అంతేనా... అవును అంతేరా... ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే ! చేస్తానే !! కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే ! దిద్దేనే !! ఆ... నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు అంతేనా అంతేనా... అవును అంతేరా... మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా తలంబ్రాలు పొయ్యాలా గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా...